ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిరసన
ABN, Publish Date - Feb 18 , 2024 | 01:51 AM
స్థానిక ఎన్‌జీఓ హోం ఎదురు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్‌లు ప్రభుత్వం తీర్చాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.
మార్కాపురం వన్‌టౌన్, ఫిబ్రవరి 17: స్థానిక ఎన్‌జీఓ హోం ఎదురు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్‌లు ప్రభుత్వం తీర్చాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం తాలుకా జేఏసీ ఛైర్మన్ శ్రీనివాసశాస్త్రీ, ఉపాధ్యాక్షులు రమేష్‌రెడ్డి, కార్యదర్శి వి.శ్రీనివాస్, పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, జేఏసీ నాయకులు రవికిరణ్, బాల విజయకుమారి, అందె శ్రీనివాసరావు, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
కంభం : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరు తూ శనివారం కంభం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యా యులు, ఫించన్‌దారులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎన్‌జిఒ సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడు దల చేయాలన్నారు. ఏఐటీయూసీ నాయకులు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ ఉద్యోగులు తమ సొంత డబ్బును పీఎఫ్, ఎపిజిఎల్‌ఐ లాంటి పథకాలలో ప్రతి నెలా చెల్లిస్తూ కుటుంబ అవసరాలను వాటి నుండి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు. కంభం తాలూకా కేంద్రంలో సుమారు 100 మందితో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశామన్నారు.
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి
గిద్దలూరు : సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. వేతన సవరణ, డీఅరియర్స్, జిపిఎఫ్, ఎపిజిఎల్‌ఐ, తదితర విషయాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డిమాండ్ల సాధన కోసం సమ్మెకైనా సిద్దమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జెఎసి చైర్మన్ నరేష్‌బాబు, ఎపిటిఎఫ్ నాయకులు శ్రీనివాసులు, కబీర్, కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2024 | 01:51 AM