ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!

ABN, Publish Date - Mar 02 , 2024 | 11:00 PM

జిల్లాలో చోరీలు... నేరాల సం ఖ్యను తగ్గించాలని రెండేళ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమరాలు) నిద్రపోతున్నాయి. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా చాలాచోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప్రోద్బలంతో మండలంలో షాపుల యజమాను లు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వ చ్చి సీసీలను ఏర్పాటు చేశారు. ఈ కెమారాల వ్వవస్థ ప్రస్తుతం పూర్తిగా మూలనపడడంతో ప్రజాప్రతినిధు లు, కొందరు దాతలు చేసిన సహకారమంతా బూడిదలోపోసిన పన్నీరైంది.

వెలిగండ్ల బస్టాండ్‌ సెంటర్‌లో పనిచేయని సీసీ కెమరాలు

వారం రోజుల వ్వవధిలో రెండు చోరీలు

కొరవడుతున్న పోలీస్‌ పర్యవేక్షణ

బెంబెలెత్తుతున్న ప్రజలు

వెలిగండ్ల, మార్చి 2 : జిల్లాలో చోరీలు... నేరాల సం ఖ్యను తగ్గించాలని రెండేళ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమరాలు) నిద్రపోతున్నాయి. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా చాలాచోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప్రోద్బలంతో మండలంలో షాపుల యజమాను లు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వ చ్చి సీసీలను ఏర్పాటు చేశారు. ఈ కెమారాల వ్వవస్థ ప్రస్తుతం పూర్తిగా మూలనపడడంతో ప్రజాప్రతినిధు లు, కొందరు దాతలు చేసిన సహకారమంతా బూడిదలోపోసిన పన్నీరైంది. ఒక్క సీసీ కెమరా వంద మంది పోలీసులకు సమానం అన్న సూ క్తిని పలు సందర్భాల్లో పోలీస్‌ అధికారులు చెప్పినా ఆ చరణలో విఫలమైంది. దీంతో నిఘా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

వారం రోజుల్లో రెండు చోరీలు

వెలిగండ్ల మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీ ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు వారం రోజుల వ్వవధిలో వరుసగా రెండు దొంగ తనాలు బస్టాండ్‌ సెంటర్‌లో కిరాణా దుకాణంలో తెల్లవారు జామున షాపు షట్టర్‌ తాళాలు పగులగొట్టి రూ.50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌లో దొంగలు చోరీకి యత్నించారు. అక్కడ నగదు లేకపోవడంతో దొంగలు వెళ్లిపోయారు ఎవరింట్లో, ఏ షాపులో దొంగలు పడతారని జనాలు భయపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించి దొంగల బెడద నుంచి కాపడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 02 , 2024 | 11:00 PM

Advertising
Advertising