ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాడేపల్లి ప్యాలెస్కు.. కప్పం 50 వేలు!

ABN, Publish Date - Dec 01 , 2024 | 02:09 AM

సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో గద్దెనెక్కిన జగన్‌.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా మద్యాన్ని కమీషన్లకు కేంద్రంగా వాడుకున్నారు. ఎక్కడా వసూళ్లు అనే పదం కనిపించకుండా

గత ఐదేళ్లలో ఒక్కో మందుబాబు కట్టిన జేట్యాక్స్‌ ఇది

మద్యం తాగేవారిని నిలువునా దోచిన నాటి ప్రభుత్వం

అమ్మఒడికి ఇచ్చిందంతా లిక్కర్‌లో బాదుడు

కమీషన్ల కోసం కంపెనీలకు అధిక ధరల చెల్లింపు

పెంచిన మొత్తం జేట్యాక్స్‌ రూపంలోనాటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే

పేదల సంపాదనలో సగం తాగుడుకే

ఇప్పుడు జగన్‌ దిగిపోవడంతో జేట్యాక్స్‌కు చెల్లు

టెండర్ల కమిటీ ముందుకు వెళ్లకముందే

ధరలు తగ్గిస్తున్న కంపెనీలు

ముడుపుల బాధ లేకపోవడం వల్లే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో గద్దెనెక్కిన జగన్‌.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా మద్యాన్ని కమీషన్లకు కేంద్రంగా వాడుకున్నారు. ఎక్కడా వసూళ్లు అనే పదం కనిపించకుండా పక్కా ప్లాన్‌తో ఏకంగా మద్యం కంపెనీల నుంచే ప్రభుత్వ పెద్దలు ముడుపులు వసూలు చేసుకున్నారు. ఫలితంగా కంపెనీలకు ఇచ్చే ధర కంటే అదనంగా చెల్లించారు. ధర పెంచడంతో ఆ భారం వినియోగదారులపై పడింది. పక్క రాష్ర్టాల్లో లేని ధరలు మన దగ్గర బాదారు. ఒక బ్రాండ్‌ ధర పొరుగు రాష్ట్రంలో క్వార్టర్‌ రూ.170 ఉంటే ఏపీలో రూ.220కి అమ్మారు. ఒకే బ్రాండ్‌, ఒకే పరిమాణం, ఒకే క్వాలిటీ అయినప్పుడు ఇంత తేడా ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. పోనీ అలా భారీగా పెంచిన ధరల వల్ల వచ్చిన పన్నులు ప్రభుత్వానికి వెళ్లాయా అంటే అదీ లేదు. వినియోగదారుల నుంచి కంపెనీలకు వెళ్లి, అక్కడినుంచి జేట్యాక్స్‌ రూపంలో తాడేపల్లి ప్యాలె్‌సకు చేరాయి. ఇలా అన్ని బ్రాండ్లపై అదనంగా వసూలు చేశారు. సగటున చూస్తే క్వార్టర్‌పై రూ.30 అదనంగా బాదేశారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మందుబాబులు ప్రతిరోజూ వారి సంపాదన నుంచి సగటున రూ.30 తాడేపల్లి ప్యాలె్‌సకు జేట్యాక్స్‌ కట్టారు. అది ఐదేళ్లకు లెక్కిస్తే రూ.50 వేలు దాటిపోయింది. అదే జేట్యాక్స్‌ లేకపోతే ప్రతిరోజూ మందు తాగినా ఆ రూ.50 వేలు పేద కుటుంబాలకు మిగిలేవి. కానీ కమీషన్లే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేసి మరీ అదనపు వసూళ్లకు తెగబడింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవే బ్రాండ్ల ధరలు తగ్గించడంతో అసలు విషయం బయటపడుతోంది.

  • అమ్మఒడి పథకం కింద బడికి వెళ్లే పిల్లలున్న కుటుంబాలకు జగన్‌ ఐదేళ్లలో ఇచ్చింది రూ.55 వేలు. మద్యం అలవాటున్న కుటుంబాల నుంచి జేట్యాక్స్‌ రూపంలో ఐదేళ్లలో వసూలు చేసింది రూ.50 వేలు. అంటే అమ్మఒడికి ఎంత ఇచ్చారో దాదాపుగా అంతే స్థాయిలో వెనక్కి లాక్కున్నారు.

  • జేట్యాక్స్‌ అంటే మద్యం సీసా తయారీ ఖర్చు, ప్రభుత్వానికి వెళ్లే పన్నులు కాదు. వాటికి అదనంగా వైసీపీ పెద్దలకు చెల్లించిన ముడుపులు. ఈ రూపంలో ఒక్కో వ్యక్తి ఐదేళ్లలో అక్షరాలా రూ.50 వేలకు పైగా కప్పం కట్టాడు.

క్వార్టర్‌ సీసాపై రూ.30-50 బాదుడు

30 లక్షల కుటుంబాలపై ప్రభావం

జాతీయ సర్వే సంస్థల అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి మద్యం తాగే అలవాటుంది (వీరు కాకుండా అప్పుడప్పుడు తాగేవారూ ఉన్నారు). అంటే 30 లక్షల కుటుంబాలపై గత ప్రభుత్వంలో ఆర్థిక భారం పెరిగింది. అసలే మద్యం ధరలు పెరిగాయనుకుంటే, అదనంగా జేట్యాక్స్‌తో ఇంకా దోపిడీకి గురయ్యారు. 2019-24 మధ్య రాష్ట్రంలో రూ.99,413 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అందులో దాదాపు 10 శాతం జేట్యాక్స్‌ అనే వాదన ఉంది. అయితే అందరికీ వాటాలు పోగా తాడేపల్లి ప్యాలెస్కు రూ.3,113 కోట్లు అందాయని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.


కుటుంబాలు ఛిన్నాభిన్నం

గత ప్రభుత్వంలో పేదల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యా యి. మద్యనిషేధం చేస్తారని మహిళలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు గుమ్మరించడమే గాక.. మందు పేరు తో దోపిడీ చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్‌.. తొలుత భారీగా రేట్లు పెంచారు. అదంతా తాగుడును తగ్గించడానికేనని నమ్మబలికారు. తీరా చూస్తే ధరలు పెంచింది పేదల కోసం కాదని, జేట్యాక్స్‌ కోసమని తర్వాత బయటపడింది. కరోనా సమయంలో బాగా పెంచి.. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. అయినా పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఉంది. దీనికి ఏకైక కారణం కమీషన్లు. దీంతో అంతకుముందు పేదలు రోజు కూలీలో పావు వంతు మందుకు ఖర్చు పెడితే.. జగన్‌ జమానాలో సగానికిపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీ పనులు చేసుకునేవారిలో మద్యం అలవాటున్నవారు రోజుకు కనీసం ఒక క్వార్టర్‌ తాగుతారు. అంటే ప్రతిరోజూ వారి సంపాదనలో మందుకు ఖర్చు పెట్టడమే కాకుండా రూ.30 నుంచి రూ.50 జేట్యాక్స్‌ కూడా కట్టారు. ఇలా ఏడాదికి రూ.10 వేలు, ఐదేళ్లకు రూ.50 వేలు జేట్యాక్స్‌ కట్టారు.

ఇప్పుడూ ఆరోపణలేనంటారా?

జగన్‌ హయాంలో మద్యం ధరలు పెంచినప్పటి నుంచీ ఈ కమీషన్ల వ్యవహారంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. జేట్యాక్స్‌ కోసమే భారీగా రేట్లు పెంచారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాదని అప్పట్లో వైసీపీ తీవ్రంగా ఖండించింది. మద్యం కంపెనీలే ధరలు పెంచాయంటూ ఐదేళ్లపాటు నమ్మించే ప్రయత్నం చేసింది. అదే నిజమైతే ఇప్పుడా కంపెనీలు ధరలు తగ్గించడం ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం మారిపోగానే ధరలు ఎందుకు తగ్గించుకుంటున్నాయి? త్వరలో టెండర్ల కమిటీ ముందు చర్చలు జరగాల్సి ఉన్నా ముందుగానే ఎందుకు రేట్లు తగ్గించేశాయి? ఇప్పుడు కమీషన్లు లేవన్నదే వీటికి సమాధానం. దాదాపుగా అన్ని కంపెనీలు ప్రస్తుతం ఇస్తున్న ధర కంటే తక్కువకే మద్యం సరఫరా చేస్తామని ముందుకొస్తున్నాయి. కమీషన్ల బెడద తీరడంతో ఇంతకాలం అదనంగా తీసుకున్న నగదును వదులుకునేందుకు సిద్ధపడుతున్నాయి.

Updated Date - Dec 01 , 2024 | 02:09 AM