SriRamaNavami: శ్రీరాముడు శ్రీరాముడే
ABN, Publish Date - Apr 16 , 2024 | 08:30 PM
చైత్ర మాసం వసంత నవరాత్రులతో ఆరంభమవుతుంది. అంటే ఈ చైత్ర మాసంలో పాడ్యమి రోజు తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాదితో ప్రారంభమై.. నవమి రోజు అంటే శ్రీరామనవమితో ఈ వసంత నవరాత్రులు ముగుస్తాయి. అలాంటి చైత్రశుద్ద నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించారు.
చైత్ర మాసం వసంత నవరాత్రులతో ఆరంభమవుతుంది. అంటే ఈ చైత్ర మాసంలో పాడ్యమి రోజు తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాదితో ప్రారంభమై.. నవమి రోజు అంటే శ్రీరామనవమితో ఈ వసంత నవరాత్రులు ముగుస్తాయి. అలాంటి చైత్రశుద్ద నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించారు.
త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు.. యుగాలు మారిన.. దేవుడిగా నేటికి ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల కొలుస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే ఈ శ్రీరామచంద్రముర్తి గుడి లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదేమో.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలంలో భక్త రామదాసు నిర్మించిన శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు నేటికి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజు ఆ స్వామి వారి కల్యాణం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. భద్రచలంలో శ్రీరామనవమి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుండగా.. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాడ వాడలా ఈ నవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం అంగరంగం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ఊరు జై శ్రీరామ్.. జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే ఈ ఏడాది జనవరిలో శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో.. బాల రాముని విగ్రహం ప్రతిష్టించడం మరో ముఖ్య విశేషం.
ధర్మం, న్యాయం, నీతి నిజాయితీ, సత్ ప్రవర్తన, ఒక భార్య, ఒక బాణం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం... మానవుని రూపంలో ఉన్న దేవుడైనా.. ఎక్కడ తన బలాన్ని ప్రదర్శించకుండా ఉండడం... ఇవన్నీ శ్రీరామునిలోని సద్గుణాలు.
అందుకే రాముడు సకల గుణాభిరాముడయ్యారు. ఇక శ్రీరామనవమి రోజు.. భక్తి, శ్రద్దలతో చేసే పనులు లోకాన్ని సంరక్షిస్తాయని ఆయన భక్తుల ప్రగాఢ విశ్వాసం. తరాలు మారిన.. యుగాలు మారిన.. శ్రీరాముడు శ్రీరాముడే.. ఆయన నామస్మరణ.. కష్టాల కడలి నుంచి ప్రతి ఒక్కరిని కాపాడుతోంది.
శ్రీరామ రామ రామాతి రమే రామే మనోరమే.. సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే అనే మంత్రం చదివితే విష్ణు సహస్ర నామం చదవినంత ఫలం పొందుతారని శ్రీరాముని భక్తులు వివరిస్తారు.
Updated Date - Apr 16 , 2024 | 09:09 PM