ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెరువులో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:45 PM

చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఆర్డీవో డాక్టర్‌ భరత్‌ నాయక్‌ హెచ్చరించారు. హరిపురం గ్రామం లోని పెద్దమాడి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు.

హరిపురం: పొద్దుమాడి చెరువును పరిశీలిస్తున్న ఆర్డీవో భరత్‌నాయక్‌

హరిపురం: చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఆర్డీవో డాక్టర్‌ భరత్‌ నాయక్‌ హెచ్చరించారు. హరిపురం గ్రామం లోని పెద్దమాడి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. చెరువు ఆక్రమణపై కలెక్టర్‌కు, ఆర్డీవోకు ‘స్పందన’ లో ఫిర్యాదులు రావడంతో సదరు ప్రాంతాన్ని సందర్శించారు. ఎవరైనా పనులు చేపడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎల్‌.తిరుమలబాబును ఆదేశించారు. ఆయనతో పాటు ఆర్‌ఐ చిన్నారావు, సర్వేయర్‌ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

అన్యాక్రాంతం కాకుండా చూడండి

జమ్ము(నరసన్నపేట): జమ్ము పంచాయతీలోని ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రంగయ్య అన్నారు. బుధవారం స్థానిక కంకర కోనేరును పరిశీలించారు. అనాదిగా ఉన్న కోనేర్లను పరిరక్షించా లన్నారు. చెరువులు, బందలు ఆక్రమణలు కాకుండా రెవెన్యూ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కనకారావు, అప్పల నాయుడు, పంగ వెంకట రమణ, సర్వే అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:45 PM

Advertising
Advertising