ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శతాధిక వృద్ధురాలి మృతి

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:31 AM

తాడివలసకు చెందిన శతాధిక వృద్ధురాలు పైడి నీలమ్మ (101) గురువారం మృతి చెందారు. విశాఖలో చిన్న కుమారుడు పాపారావు వద్ద నీలమ్మ ఉంటున్నారు.

మృతి చెందిన శతాధిక వృద్ధురాలు నీలమ్మ(ఫైల్‌)

పొందూరు: తాడివలసకు చెందిన శతాధిక వృద్ధురాలు పైడి నీలమ్మ (101) గురువారం మృతి చెందారు. విశాఖలో చిన్న కుమారుడు పాపారావు వద్ద నీలమ్మ ఉంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్న నీలమ్మకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నీలమ్మ మృతదేహాన్ని స్వగ్రామం తాడివలస తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నీలమ్మకు ముగ్గురు కుమారు లు గణపతి, రమణ, పాపారావుతోపాటు నలుగురు కుమార్తె లు కృష్ణవేణి, లక్ష్మీనారాయణ, సావిత్రి, గున్నమ్మ ఉన్నారు. కాగా నీలమ్మకు 64 మంది మనుమలు, మనమరాళ్లు, మునిమనమలు, మునిమనుమరాళ్లు ఉన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

ఆమదాలవలస: పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయపడిన జాడ దుర్గారావు (47) చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే అండర్‌ టన్నల్‌ వద్ద ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడిన దుర్గారావును 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుర్గారావు భార్య సూర్యరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు..

శ్రీకాకుళం క్రైం: బీసీల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు పిట్టా చంద్రపతిరావు గురువారం అర్ధరాత్రి 2 గంటలకు తన నివాసంలోనే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బీసీ సంఘ నేతలు, రాజకీయ నాయకులు శుక్ర వారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించను న్నట్టు సంఘ నేతలు, కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 12:31 AM

Advertising
Advertising