మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:28 AM

శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ‘రా.. కదలి రా’ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులతోపాటు సుమారు లక్షమంది ప్రజలు సభకు తరలిరానున్నారు.

చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ తదితరులు

అరసవల్లి, ఫిబ్రవరి 24: శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ‘రా.. కదలి రా’ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులతోపాటు సుమారు లక్షమంది ప్రజలు సభకు తరలిరానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సభాస్థలి, వేదిక, హెలీప్యాడ్‌ నిర్మాణం తదితర ఏర్పాట్లను మాజీమంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు గణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, మీడియా కో-ఆర్డినేటర్‌ ఎస్వీ రమణ మాదిగ, జల్లు రాజీవ్‌, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, విభూది సూరిబాబు, గుత్తు చిన్నారావు, బుక్కా యుగంధర్‌పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:28 AM

Advertising
Advertising