ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాబు సూపర్‌ సిక్స్‌తో ప్రజా సంక్షేమం

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:29 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా సత్యవరంలో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహించారు.

నరసన్నపేట: సత్యవరంలో కరపత్రాలిచ్చి అవగాహన కలిగిస్తున్న బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఫిబ్రవరి 27: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా సత్యవరంలో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపట్టనున్న సంక్షేమ పథకాలను వివరిం చారు. వైసీపీ వైఫల్యాలపై అవగాహన కలిగించి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్‌, జిల్లా అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకుడు బెవర రాము, నాయకులు పీస కృష్ణ, ఊణ్ణ వేంకటేశ్వరరావు, కింజరాపు రామారావు, సరిపల్లి మధు, మావుడూరి జగదీష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ-జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి

జలుమూరు (సారవకోట): టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ మండల అధ్య క్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. బుడితి లక్ష్మీపురంలో మంగళవారం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను, టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పొదిలాపు వేణుగోపాలరావు, డి.జయరాం, తర్ర లచ్చుము, ఎం.గోవిందరావు, చల్ల జనార్దన, చంద్రయ్య, బలగ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:29 PM

Advertising
Advertising