ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: విజయవాడకు భారీగా పోలీసులు.. తగ్గేదే లే అంటున్న టీచర్స్... ఏం జరుగనుందో?

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:50 AM

Andhrapradesh: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు (మంగళవారం) విజయవాడలో 36 గంటల ధర్నాకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే టీచర్స్‌ను అడ్డుకునేందుకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

విజయవాడ:, జనవరి 9 తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు (మంగళవారం) విజయవాడలో 36 గంటల ధర్నాకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే టీచర్స్‌ను అడ్డుకునేందుకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.


విజయవాడ చేరుకొంటున్న టీచర్స్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిబంధనలు ఉల్లoఘించి నిరసనలు తెలిపితే కఠినమైన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా తగ్గేది లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. పోలీసుల ఆంక్షలు, టీచర్స్ ధర్నా నేపథ్యంలో నగరంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

కాగా.. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయుల సమాఖ్య ఈ ధర్నాకు పిలుపు ఇచ్చింది. విజయవాడలో మంగళ, బుధవారాల్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు ఉపాధ్యాయులు వెళ్లకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. పలు ప్రాంతాల్లో ధర్నాకు ఉపాధ్యాయులు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 11:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising