వైభవంగా కోదండరాముని కల్యాణం
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:58 PM
ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన కోదండరామాలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్క రించుకుని సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ఒంటిమిట్ట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన కోదండరామాలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్క రించుకుని సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణ మండపం వద్ద ఉంచి కల్యాణతంతును ప్రారంభించారు. పుణ్యాహ వచనం, యజ్ఞోపవితరణ, కంకణధారణ తదితర పూజలు నిర్వహించి అనంతరం వైష్ణవ సంప్రదాయంలో వేదపండితుల మధ్య సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేసే తంతు జరిపించారు. అనంతరం తలంభ్రాల సమర్పణ, పూలచెండ్ల మార్పిడి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో టీటీడీ ఇన్‌స్పెక్టర్ నగేష్, అర్చకులు పవన్‌కుమార్, శ్రావణ్‌కుమార్, సిబ్బందినాయక్, రామ నరసింహులు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 11:58 PM