ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సామాజిక న్యాయానికి చోటేలేదు

ABN, Publish Date - Feb 13 , 2024 | 02:29 AM

‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిత్యం ఉచ్ఛరించే సామాజిక న్యాయం అనే పదానికి వైసీపీ హయాంలో చోటే లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో...

వైసీపీ పాలనలో అది నేతి బీరకాయలో నెయ్యి చందం

జగన్‌ ఒంటెద్దు పోకడలు ఎక్కువయ్యాయి

రాజధాని లేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం

బీసీలకు ఇచ్చిన పదవులన్నీ పవర్‌లేనివే

ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి: ఎమ్మెల్సీ జంగా

గుంటూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి) ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిత్యం ఉచ్ఛరించే సామాజిక న్యాయం అనే పదానికి వైసీపీ హయాంలో చోటే లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో... సీఎం జగన్‌ సామాజిక న్యాయం అంతే నిజం’ అంటూ వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ సాధికారిక కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జంగా కృష్ణమూర్తి యాదవ్‌ మండిపడ్డారు. కొద్ది రోజులుగా ఆ పార్టీ తీరును నిరసిస్తూ దూరంగా ఉంటున్న జంగా సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటి వరకు గురజాల ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తీరుపై మాత్రమే మండిపడుతూ వచ్చిన జంగా... ఈ వీడియోలో నేరుగా సీఎం జగన్‌పైనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘వైసీపీలో జగన్‌ ఒంటెద్దు పోకడలు ఎక్కువయ్యాయి. రాజధాని లేని దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు జగన్‌ హయాంలో సరైన న్యాయం జరగలేదు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీలని మాట్లాడుతున్నారే తప్ప వారి మనోభావాలను ఏనాడూ అర్థం చేసుకోలేదు. బీసీలకు తాత్కాలికంగా కొన్ని పదవులు ఇచ్చి, వారికి సామాజిక న్యాయం చేసేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో అది నిజం కాదు. రాష్ట్రంలో ఉన్న 131 బీసీ కులాల వార ం ఆనాడు జగన్‌ను నమ్మాం. అతను అధికారంలోకి వచ్చాక వారికి సరైన న్యాయం జరగలేదు. ఇచ్చిన కొద్దిపాటి పదవులు పవర్‌ లేనివే. రాష్ట్రంలో 56 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్‌ ఇప్పటివరకూ ఒక్క చైర్మన్‌ను కూడా కలిసిన దాఖలాల్లేవు. అసలు ఆ కార్పొరేషన్లకు నిధులే లేవు. సామాన్యులు, బడుగూ బలహీన వర్గాలు వారు విదేశీ విద్యను అందుకునేందుకు వీలైన సహాయాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం అందించలేకపోయింది. జగన్‌ హయాంలో బీసీలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయింది. జగన్‌ హయాంలో బీసీలు అనేక అవమానాలకు గురౌతున్నారు. వైసీపీలో బీసీలకు సరైన గౌరవం దక్కక ఎంతోమంది బీసీ నాయకులు దూరం అవుతున్నారు. ఈరోజు బీసీలు సంక్షేమ పథకాల కోసమో, ఆర్థిక వనరుల కోసమో కాదు... ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన దుస్థితి. బీసీలకు పదవులివ్వటం కాదు... వారికి అధికారం కూడా ఇవ్వాలి’ అని కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 09:10 AM

Advertising
Advertising