ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పులివెందుల గడ్డపైనే ఉంటా

ABN, Publish Date - Feb 24 , 2024 | 03:31 AM

‘తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటే నేను మరింత స్ట్రాంగ్‌ అవుతా.. భయపడేదే లేదు. పులివెందుల గడ్డపైనే ఉంటా. వైఎస్‌ జగన్‌ ఇంటి పక్కనే ఉంటా..

జగన్‌ ఇంటి పక్కనే ఉంటా.. ఏం చేసుకుంటారో చేసుకోండి

ఎన్ని స్కెచ్‌లు వేసినా ఎవరికీ భయపడేది లేదు

తప్పు దిద్దుకునేందుకే అప్రూవర్‌గా మారా

వైసీపీ గుట్టు రట్టవుతుందనే తప్పుడు కేసులు

‘సిద్ధం’లో వివేకా హత్యపై జగన్‌ మాట్లాడరేం?

అవినాశ్‌, జగన్‌ ఓట్ల కోసం వెళ్తే రాళ్లేస్తారు

బెయిలుపై విడుదలైన దస్తగిరి వ్యాఖ్యలు

కడప(క్రైం), ఫిబ్రవరి 23: ‘‘తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటే నేను మరింత స్ట్రాంగ్‌ అవుతా.. భయపడేదే లేదు. పులివెందుల గడ్డపైనే ఉంటా. వైఎస్‌ జగన్‌ ఇంటి పక్కనే ఉంటా.. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి మూడు నెలలకు పైగా కడప సెంట్రల్‌ జైలులో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను తప్పుడు కేసుల్లో జైలుకు పంపించారు. ఎర్రగుంట్లలో నేను ఎవరినీ కిడ్నాప్‌ చేయలేదు. మా కుటుంబం గురించి మాట్లాడేందుకు వెళితే అక్టోబరులో నాపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి చాలా పెద్దతప్పు చేశానని, నేను బతికుండటమే కష్టమని అన్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్‌ కొట్టి చెప్పించారని చెప్పాలని సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీలు బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురిచేశారు. అప్రూవర్‌గా మారినందుకే వైసీపీ నాయకులతో పాటు పోలీసులు కూడా నన్ను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భయపడే ప్రసక్తి లేదు. చేసిన తప్పు సరిదిద్దుకునేందుకే అప్రూవర్‌గా మారాను. అక్టోబరు 31న నాపై కేసు నమోదు చేయడంతో పాటు సీఐ తీవ్రంగా కొట్టారు. నన్నెందుకు అరెస్టు చేశారని అడిగినందుకు నా భార్యాబిడ్డలను కూడా జైలుకు పంపిస్తామన్నారు. నేను జైలుకు పోకుండా ఉండేందుకు మరో ఆప్షన్‌ ఉందని, ప్రెస్‌మీట్‌ పెట్టి వివేకా హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు అలా చెప్పించారని చెబితే చాలు.. మిగతాది ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి చూసుకుంటారని చెప్పారు. నేను తిరస్కరించాను. జగన్‌ ప్రభుత్వంలోనే అప్రూవర్‌గా మారాను. ఈ ఘటనపై జగన్‌ ఆ రోజే ఎందుకు ప్రె్‌స్‌మీట్‌ పెట్టలేదు. నాపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? కౌన్సిలర్‌ రాజశేఖర్‌రెడ్డి మా ఇంటికి వెళ్లి జైలులో ఉన్న నన్ను చంపుతామని నా భార్యను బెదిరించారు. మనోహర్‌రెడ్డి వచ్చి మాట్లాడతారని చెప్పారు. వివేకాను హత్యచేసి ప్రజలను అమాయకులను చేసి ఓట్లు వేయించుకున్నారు. పీఏ కృష్ణారెడ్డిని లొంగదీసుకున్నట్లు నన్ను లొంగదీసుకోలేరు.

వారు ఎన్ని స్కెచ్‌లు వేసినా భయపడే ప్రసక్తిలేదు. కేసులకు కూడా భయపడను. అన్నింటినీ ఎదుర్కొంటా. ఎవరితో అయినా ఎంతవరకైనా ఢీకొంటా. అప్రూవర్‌గా మారడం తప్పా? ఒకసారి అప్రూవర్‌గా మారాక చనిపోయే వరకూ అలాగే ఉంటా. మాట మార్చను. అవినాశ్‌ కానీ జగన్‌ కానీ ఓట్ల కోసం వెళితే రాళ్లు వేసే పరిస్థితి ఉంది. సిద్ధం సభల్లో జగన్‌ అన్నీ మాట్లాడుతున్నాడు. ప్రజలకు అవి చేశాం... ఇవి చేశాం... అని చెబుతున్నాడు. ఆ సభల్లో వివేకా హత్య గురించి జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదు? నాకు సోమవారమే బెయిలు వచ్చినప్పటికీ దాన్ని రాజకీయం చేసి వేముల ఎస్‌ఐ కోర్టు కానిస్టేబుళ్లతో జడ్జి వద్దకు వెళ్లారు. మరుసటి రోజు ష్యూరిటీలతో నా భార్య వెళ్లింది. అయితే దస్తగిరి ఏ-3 కాదని, ఏ-1కు మార్చామని పోలీసులు చెప్పడంతో బెయిలు ఆలస్యమైంది. ఆన్‌లైన్‌ ఉన్న ఎఫ్‌ఐఆర్‌లో ఏ-3గా ఉన్న నన్ను ఏ-1గా ఎలా మార్చారో అర్థం కావడం లేదు. నేను బయట ఉంటే వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే తప్పుడు కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారు. అణగదొక్కాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదు. గతంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి ఆసుపత్రి పేరు చెప్పి నా దగ్గరకు వచ్చాడు. తన తండ్రి జైలులో ఉన్నాడని, తమ రాజకీయ భవిష్యత్తు బాగుపడాలంటే చెప్పినట్లు వినాలని, ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడు.వారి మాటలకు తలవంచే పరిస్థితి లేదని చెప్పాను’’ అని దస్తగిరి వివరించారు. జైలు నుంచి బయటికి వచ్చిన దస్తగిరికి ఆయన భార్య షబానా దిష్టి తీశారు. అనంతరం ఎస్కార్టుతో కారులో బయల్దేరి పులివెందులకు వెళ్లారు.

Updated Date - Feb 24 , 2024 | 03:31 AM

Advertising
Advertising