ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రేట్‌ ఎస్కేప్‌

ABN, Publish Date - Nov 08 , 2024 | 05:01 AM

అది... కడప నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్‌. సమయం... మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు.

Varra Ravindra Reddy

సినీ ఫక్కీలో వర్రా ‘డ్రామా’.. వైసీపీ పోలీసుల సహకారంతోనే పరారీ

‘కూటమి’ నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో కాలకూట విషం చిమ్మిన వర్రా రవీంద్రా రెడ్డి! అతడిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసులు! అతడి అరెస్టు కోసం రెండు జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు! డీఐజీ స్వయంగా పర్యవేక్షించారు! వర్రా అరెస్టుకు పకడ్బందీ వ్యూహం రచించారు. అయినప్పటికీ... తప్పించుకున్నాడు! ఇదో గ్రేట్‌ ఎస్కేప్‌! దీని వెనుక ఎవరున్నారు? అక్కడేం జరిగింది?

‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

రాజంపేట పోలీసుల వైఫల్యం

వర్రాను పట్టుకునే బాధ్యత కానిస్టేబుళ్లకు

అప్పగించిన ఎస్‌ఐ.. ఆయనపై అనుమానాలు

పోలీసులు ఆపినప్పుడు విలేకరినని చెప్పి

కారులో ఉడాయించిన రవీంద్రారెడ్డి

తర్వాత వైసీపీ కీలక నేతలతో ఎస్‌ఐ చర్చలు?

(అమరావతి/రాయచోటి/కడప-ఆంధ్రజ్యోతి)

ది... కడప నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్‌. సమయం... మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. పలువురు ప్రముఖులపై సోషల్‌ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టిన జగన్‌ సతీమణి భారతీరెడ్డి పీఏ, ఎంపీ అవినాశ్‌ అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డి స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నాడు. అంతకంటే బలమైన మరో కేసులో అరెస్ట్‌ చేయడానికి స్టేషన్‌ బయట రాజంపేట పోలీసులు సిద్ధంగా ఉన్నారు. తాలూకా స్టేషన్‌ నుంచి వర్రా రవీంద్రారెడ్డి బయటకు రాగానే అరెస్ట్‌ చేయడమే తరువాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు తప్పించుకునే చాన్సే లేదు. అయినప్పటికీ... పోలీసుల కన్ను కప్పి వర్రా ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ అయ్యాడు..! ఇది ఎలా సాధ్యమైంది? లోతుల్లోకి వెళితే సంచలన విషయాలు బయటపడుతున్నాయి.


ఇదీ కేసు నేపథ్యం

వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను దూషిస్తూ పోస్టులు పెట్టాడని రేవూరి నరసింహ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ నెల 5న రాజంపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 352, 353(1)సీ, 353(2 బీఎన్‌ఎ్‌స 67, ఐటీఏ 2000 యాక్టుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజున సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వర్రా రవీంద్రారెడ్డి నీచమైన పోస్టులు పెట్టాడంటూ టీడీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు కడప తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు చిన్నచౌకు సీఐ తేజోమూర్తి ఆధ్వర్యంలో పోలీసు బృందం మంగళవారం వేములకు వెళ్లి అతడిని తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అయితే అతడిపై ఇంతకంటే బలమైన కేసు రాజంపేటలో నమోదుకావడంతో, ఆ కేసులో అరెస్ట్‌ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆదేశాల మేరకు కడప పోలీసులు రాజంపేట డీఎస్పీ స్థాయి అఽధికారులకు దీనిపై సమాచారం అందించారు.

నాటకీయ ఫక్కీలో...

మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు రాజంపేటకు చెందిన ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌ రెడ్డి, మరో నలుగురు కానిస్టేబుళ్లు వర్రాను అరెస్టు చేసేందుకు కడపకు చేరుకున్నారు. అతను పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలన్నది వారి ఆలోచన. అయితే... ఎస్‌ఐ దూరంగా ఉండిపోయి, వర్రాను పట్టుకునే పనిని ఇద్దరు కానిస్టేబుళ్లకు అప్పగించారు. అప్పటికి ఒక న్యాయవాది, మరో అనుచరుడితో కలిసి వర్రా ఠాణాలో ఉన్నాడు. అసలే మహా ముదురు! అరెస్టు కాకుండా ఉండేందుకు అన్నిరకాల ఎత్తులూ వేసే అవకాశముంది! అందుకే... పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వర్రా ఫొటోను ముందుగానే రాజంపేట పోలీసులకు పంపించారు. ఠాణాలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని తొలుత పంపిస్తామని... వర్రాను చివర్లో పంపిస్తామని, అతడిని అదుపులోకి తీసుకోవాలని సమాచారం ఇచ్చారు. తొలుత న్యాయవాదిని బయటికి పంపించారు. అయితే... అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులను గుర్తించిన ఆయన తిరిగి స్టేషన్‌లోకి వచ్చేశారు. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదుకానీ... వర్రా రవీంద్రారెడ్డి ముందుగా స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే వర్రా ఫొటోను చూసిన పోలీసులు... పోలికలు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ‘నేను పత్రికా విలేకరిని. నన్ను ఎందుకు ఆపారు’ అని దబాయించడంతో వదిలేశారు. తర్వాత వర్రా రవీంద్రారెడ్డి వెంట వచ్చిన న్యాయవాది బయటకు వచ్చారు. ఆయన్ను కూడా రాజంపేట పోలీసులు ఆపారు. తాను న్యాయవాదినని చెప్పడంతో విడిచిపెట్టారు. తమకు ముందుగా అందిన సమాచారం ప్రకారం... మూడో వ్యక్తి కచ్చితంగా వర్రా అయి ఉంటాడని భావించారు. మూడో వ్యక్తి రాగానే అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు... దూరంగా ఉన్న ఎస్‌ఐ లక్ష్మీ ప్రసాదరెడ్డి అక్కడికి వచ్చారు. తాము పట్టుకున్నది అసలు వ్యక్తిని కాదని గుర్తించారు. అప్పటికే... వర్రా రవీంద్రా రెడ్డి అక్కడి నుంచి కారులో ఉడాయించాడు.


వైసీపీ పోలీసుల కుట్ర?

వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు విషయాలను, వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కొందరు పోలీసులు వైసీపీ ముఖ్య నేతలకు చేరవేసినట్లు సమాచారం. కడప పార్లమెంటు స్థాయిలో ఓ ముఖ్య నాయకుడికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు తెలియజేసినట్లు తెలిసింది. జిల్లా పోలీసు విభాగంలో స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేసిన ఓ సీఐ ఇందులో క్రియాశీలంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆయన ఐదు నెలలుగా యూనిఫామ్‌కు దూరంగా ఉన్నా తనకున్న పరిచయాలతో పక్కా స్కెచ్‌తో వర్రాను తప్పించారని తెలుస్తోంది. అదే సమయంలో రాజంపేట నుంచి వర్రాను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగానే రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునే బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించినట్లు పోలీసు శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రవీంద్రారెడ్డి పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకున్న తర్వాత.. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర స్థాయి పదవి ఉన్న నాయకుడితో సదరు ఎస్‌ఐ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వర్రాను అరెస్టు చేయకపోతే తనపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారేమోనని ఎస్‌ఐ ఆ నాయకుడితో చర్చించినట్లు పోలీసు శాఖలో ప్రచారం జరుగుతోంది.

నాలుగు బృందాలతో వేట

పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా కోసం కడప జిల్లా ఏఎస్పీ ప్రకాశ్‌బాబు నేతృత్వంలో 4 ప్రత్యేక బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వాహన శ్రేణి నంబర్‌ 567. వర్రా రవీంద్రా రెడ్డి కూడా 567 నంబరు తో ఉన్న ఓ పాత వాహనాన్ని తన సోదరుడి పేరుతో కొనుగోలు చేశా డు. పోలీసుల నుంచి వర్రా తప్పించుకున్నాక 567 నంబరు వాహనంలో వెళ్లాడని సమాచారం రావడంతో పోలీసులు వెంటనే తనిఖీ చేశారు. అయితే అందులో వర్రా లే డు. కడప నుంచి జంప్‌ అయిన వ ర్రా వాహనంలో పులివెందుల వెళ్లి అక్కడ నుంచి బెంగళూరుకు పో యాడని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 08:18 AM