ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చే ఏడాది జూన్‌కు విజయవాడ టెర్మినల్‌ రెడీ

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:55 AM

గన్నవరం విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటగ్రల్‌ టెర్మినల్‌ వచ్చే ఏడాది జూన్‌ నాటికి సిద్ధమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. 2020 జూన్‌లో 611.80 కోట్ల అంచనా వ్యయంతో దీని

టికెట్ల ధరల ఆకస్మిక పెంపుపై విచారణ: రామ్మోహన్‌

‘శ్రీవెంకటేశ్వర విమానాశ్రయం’గా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌

న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గన్నవరం విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటగ్రల్‌ టెర్మినల్‌ వచ్చే ఏడాది జూన్‌ నాటికి సిద్ధమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. 2020 జూన్‌లో 611.80 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణం చేపట్టామని, కొవిడ్‌, తుఫాన్ల వంటి కారణాలవల్ల నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతానికి 48.5 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గురువారం లోక్‌సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు రామ్మోహన్‌నాయుడు లిఖితపూర్వక సమాధామిచ్చారు. అలాగే.... అకస్మాత్తుగా, అడ్డగోలుగా విమాన టికెట్‌ ధరలు పెంచడంపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో చెన్నై నుంచి ఢిల్లీకి టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించగా... తొలుత రూ.25వేల ధర చూపించిందని, బుకింగ్‌ పూర్తయ్యేసరికి అది రెండుమూడు రెట్లు పెరిగిందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని స్పీకర్‌ చెప్పడంతో దీనిపై విచారణ జరుపుతామని రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. మరోవైపు... తమ పరిధిలోని విమానాశ్రయాలకు కొత్త పేర్లు పెట్టాలనిపది రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీ మొహోల్‌ తెలిపారు. తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌’ అనే పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కోరిందన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 03:55 AM

Advertising
Advertising
<