అన్నవరం ఆలయానికి పాదయాత్ర
ABN, Publish Date - Mar 13 , 2024 | 12:58 AM
మండలంలోని ధర్మవరం అగ్రహారానికి చెందిన తెలుగుయువత మండల అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, కుటుంబ సభ్యులతోపాటు సుమారు 200 మంది మంగళవారం ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.
అనితకు టికెట్ రావాలని మొక్కుకున్న తెలుగుయువత నేత
అనుకున్నది నేరవేరడంతో సత్వనారాయణస్వామి దర్శనానికి పయనం
ఎస్.రాయవరం, మార్చి 12: మండలంలోని ధర్మవరం అగ్రహారానికి చెందిన తెలుగుయువత మండల అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, కుటుంబ సభ్యులతోపాటు సుమారు 200 మంది మంగళవారం ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. వారితోపాటు కొంతదూరం నడిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పాయకరావుపేట టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు దక్కితే అన్నవరానికి నడుచుకుంటూ వెళ్లి సత్యనారాయణస్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నానని, అనితకు టికెట్ లభించడంతో మొక్కు తీర్చుకోవడానికి వెళుతున్నట్టు చెప్పారు. రానున్న ఎన్నికల్లో అనిత ఎమ్మెల్యేగా గెలవాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సత్యనారాయణస్వామిని కోరుకున్నానని, తన కోరిక నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరోసారి అన్నవరం దేవస్థానానికి పాదయాత్ర చేస్తానని శ్రీనివాస్ చెప్పారు.
Updated Date - Mar 13 , 2024 | 12:58 AM