ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాల్య వివాహాలు అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:00 AM

బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు.

మాట్లాడుతున్న బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు, చిత్రంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పీవో అభిషేక్‌, తదితరులు

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు

పాడేరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. స్థానిక కాఫీ హౌస్‌లో ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి అధ్యక్షతన బాల్య వివాహాల నియంత్రణపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వం బాలికా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. బాలికలు ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య దోహదపడుతుందన్నారు. టీనేజ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని, వసతి గృహాల్లో ఉండే పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉందన్నారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి బాలికా కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలని ఆమె కోరారు. ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ ఈ సందర్భంగా బేటీ బచావో.... బేటీ పడావో గురించి వివరించారు. ఆడపిల్లలను కాపాడాలని, ఆడ పిల్లలను చదివించాలని ఆయన సూచించారు. స్థానిక ఏఎస్‌పీ కె.ధీరజ్‌ మాట్లాడుతూ 20 ఏళ్లు కష్టపడి చదివితే 60 ఏళ్లు సుఖ పడతారన్నారు. విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం మాట్లాడుతూ బాల్య వివాహాల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, ఐసీడీఎస్‌ పీవోలు, మహిళలు, బాలికలు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:00 AM

Advertising
Advertising