ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పైనరీ అందాలు కనువిందు

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:32 AM

పైనరీ అందాలు కనువిందుపైనరీ అందాలు కనువిందు

అంజోడ సిల్క్‌ఫాంలోని పైనరీ ముఖ ద్వారం

- పర్యాటకులను ఆకట్టుకుంటున్న అంజోడ సిల్క్‌ ఫాం

డుంబ్రిగుడ, మార్చి 3: అరకులోయలో గల అంజోడ సిల్క్‌ ఫాంలోని పైనరీ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని పైన్‌ చెట్లు, పూల వనాలు, విశ్రాంతి టెంట్లు సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. పర్యాటకుల విడిది గృహాలతో పాటు రెస్టారెంట్‌ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎకో టూరిజంగా అభివృద్ధి చేసి పర్యాటకులకు మరింత ఆహ్లాదం కలిగేలా పైనరీని అటవీశాఖ ఆధునికీకరించింది. పైనరీ అభివృద్ధికి రూ.71 లక్షలు వెచ్చించారు. పైన్‌ చెట్ల నడుమ ముఖ ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సహజ సిద్ధ చెట్ల చెక్కలతో బెంచీలను ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు చుట్టూ కంచెను ఏర్పాటు చేసి పూల వనాలను అభివృద్ధి చేశారు. చుట్టూ విద్యుత్‌ కాంతులు విరజిమ్మేలా ఆధునికీకరించారు. సహజ సిద్ధ పైన్‌ చెట్ల నడుమ పర్యాటకులు ఫొటోలు దిగేందుకు, హాయిగా గడిపేందుకు పైనరీ వేదికగా నిలుస్తుంది. పైన్‌ చెట్ల నీడలో చల్లని గాలుల మధ్య టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అరకులోయ రేంజ్‌ కార్యాలయం చుట్టూ చెట్లకు విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. పైనరీ అందాలు పర్యాటకులను ఆకట్టుకోవడంతో అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:32 AM

Advertising
Advertising