YCP: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ చోటా నేతలు
ABN, Publish Date - Feb 13 , 2024 | 08:32 AM
అనకాపల్లి జిల్లా: కె.కోటపాడు మండలం, కె.సంతపాలంలో ప్రభుత్వ భూమిని స్థానిక వైసీపీ చోటా నేతలు కబ్జా చేశారు. కోట్ల రూపాయల విలువచేసే 60 సెంట్ల గ్రామ కంటాన్ని కబ్జా చేసి కంచి వేశారు.
అనకాపల్లి జిల్లా: కె.కోటపాడు మండలం, కె.సంతపాలెంలో ప్రభుత్వ భూమిని స్థానిక వైసీపీ చోటా నేతలు కబ్జా చేశారు. కోట్ల రూపాయల విలువచేసే 60 సెంట్ల గ్రామ కంటాన్ని కబ్జా చేసి కంచె వేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో ప్రభుత్వ భూమిని అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో గ్రామస్తులు గ్రామ కంఠం నిజ నిర్ధారణపై స్పందనలో ఫిర్యాదు చేశారు. కాలం గడుస్తున్నా గ్రామకంఠ స్థల వివాదం కొలిక్కిరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - Feb 13 , 2024 | 08:43 AM