గడివలస హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:03 AM
సంచలనం సృష్టించిన పాచిపెంట మండలం గడివలస హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ తెలిపారు
సాలూరు/రూరల్: సంచలనం సృష్టించిన పాచిపెంట మండలం గడివలస హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. పొలంలో శనివారం సాయంత్రం కోరాడ జోగేశ్వర్ గొంతు కోసి హత్య చేసిన విషయం విది తమే. ఈ కేసును దర్యాప్తు చేసిన సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ నిందితులు కోరాడ నరసింహులు, కోరాడ అప్పారావు, కోరాడ ఉమామహేశ్వరరావులను మంచాడవలస జంక్షన్ వద్ద మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. పాచిపెంట ఎస్‌ఐ పొదిలాపు నారాయణరావు పాల్గొన్నారు.
Updated Date - Feb 13 , 2024 | 12:03 AM