ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెళ్లి సందడి

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:29 AM

మాఘమాసం రావడంతో జిల్లాలో పెళ్లిబాజాలు మోగాయి. ఇక ఊరూరా పెళ్లి సందడే సందడి కనిపించనుంది. వాస్తవంగా గత నెల 10 వరకు మార్గశిరమాసం కావడంతో వివాహాలు జోరుగా సాగాయి. అనంతరం పుష్యమాసం వచ్చాక శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు మాఘమాసం రాగా ఏప్రిల్‌ 26 వరకు శుభముహూర్తాలున్నాయి.

మాఘమాసం రావడంతో జిల్లాలో పెళ్లిబాజాలు మోగాయి. ఇక ఊరూరా పెళ్లి సందడే సందడి కనిపించనుంది. వాస్తవంగా గత నెల 10 వరకు మార్గశిరమాసం కావడంతో వివాహాలు జోరుగా సాగాయి.

పెళ్లి సందడి

నెల రోజుల విరామం తర్వాత శుభ ముహూర్తాలు

ఒక్కటికానున్న వేలాది జంటలు

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 11: మాఘమాసం రావడంతో జిల్లాలో పెళ్లిబాజాలు మోగాయి. ఇక ఊరూరా పెళ్లి సందడే సందడి కనిపించనుంది. వాస్తవంగా గత నెల 10 వరకు మార్గశిరమాసం కావడంతో వివాహాలు జోరుగా సాగాయి. అనంతరం పుష్యమాసం వచ్చాక శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు మాఘమాసం రాగా ఏప్రిల్‌ 26 వరకు శుభముహూర్తాలున్నాయి. దీంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. ఏప్రిల్‌ 28 నుంచి జూలై 8 వరకు గురు, శుక్ర మూఢాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాఢం, శూన్య మాసం కావడంతో పెళ్లిళ్లు తదితర శుభ కార్యక్రమాలను నిర్వహించలేని పరిస్థితి. వివాహాది శుభకార్యాలకు మళ్లీ శ్రావణమాసం వరకు ఆగాల్సిందే. అందుకే ఈ శుభ సమయాల్లోనే వివాహాది శుభ కార్యక్రమాలను నిర్వహించడానికి జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు.

ఇవీ శుభ ముహూర్తాలు

ఈ నెలలో 13, 14, 17 ,18, 24, 28 ,29 తేదీల్లో శుభముహుర్తాలున్నాయి. వచ్చే నెలలో 2, 3, 15, 16, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీల్లో, ఏప్రిల్‌లో 3, 4, 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయి. అంతేకాక ఈ మూడు నెలల్లో వధూవరుల నక్షత్ర, జాతకాలు బట్టి శుభముహుర్తాన్ని వీలైన తేదీని జ్యోతిష్యులు నిర్ణయించే అవకాశముంది. ఈ కాలంలో పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, శంకు స్థాపనలు, ఉపనయనాలు నిర్వహించుకోవచ్చు. ఇదిలా ఉండగా శుభకార్యాలు ఆరంభం కావడంతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారు ఆభరణాల షాపులు రద్దీగా మారాయి. ఇప్పటికే కల్యాణమండపాలన్నీ బుక్‌ అయిపోయాయి. మరోవైపు మంగళవాయిద్యాలు, డెకరేషన్‌, పూలు, కేటరింగ్‌, వంటపనివారు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది.

ఏప్రిల్‌ 26 వరకు..

ఈనెల 13 నుంచి శుభ ముహూర్తాలు ఉన్నాయి. శుభ కార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలం. వధువరుల నక్షత్రాలు, జాతకాల ప్రకారం కూడా శుభ ఘడియలు ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 26 వరకు శుభకార్యాలు చేసుకోవచ్చు.

- జి.తిరుపతినాయుడు, జ్యోతిషుడు, సాలూరు

Updated Date - Feb 12 , 2024 | 12:29 AM

Advertising
Advertising