మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల,
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:06 PM
మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్‌రెడ్డి తెలిపారు.
మైలవరం, సెప్టెంబరు 1: మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్‌రెడ్డి తెలిపారు. గండి కోట జలాశయం నుంచి మైలవరానికి 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నీటిని వదిలినట్లు తెలిపారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజల తాగు, సాగు నీటి అవ సరాల కోసం పెన్నానదికి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. గండికోట నుంచి మైల వరానికి ఇన్‌ఫ్లో పెరిగితే మరింత నీటిని పెన్నాకు వదులుతారని పెన్నాపరి వాహక ప్రాంతీయులు అప్రమత్తంగా ఉండాలని జలాశయ అధికారులు తెలిపారు. మైలవరం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 6.500 టీఎంసీలు కాగా ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5.200 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
మైలవరానికి నీరు తగ్గింపు
కొండాపురం, సెప్టెంబరు 1: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరానికి ఆదివారం నీటి విడుదల తగ్గించినట్లు డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శనివారం నుంచి 20,000 క్యూసెక్కులు ఉన్న నీటి ప్రవాహాన్ని 2,500కు తగ్గించారు. ఇప్పటికే మైలవరంలో 5 టీఎంసీలకు పైగా నీరు ఉండడంతో సీఈ ఆదేశాల మేరకు నీటిని తగ్గించినట్లు డీఈ తెలిపారు. సీబీఆర్‌కు 1000 క్యూసెక్కులు, పెడిపాలెం రిజర్వాయిర్‌కు 880 క్యూసె క్కులు, వామికొండ, సర్వరాయసాగర్‌కు 500 క్యూసెక్కుల చొప్పున గండికోట ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గండికోటలోకి జీఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ ద్వారా 9500 క్యూసెక్కులు, వర్షపు నీటి ద్వారా 850 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉన్న ట్లు డీఈ తెలిపారు. ప్రస్తుతం గండికోటలో 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
Updated Date - Sep 01 , 2024 | 11:06 PM