ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చరిత్రహీనుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం

ABN, Publish Date - Sep 22 , 2024 | 04:09 AM

‘‘దేశంలోనే అతి పవిత్ర క్షేత్రాల్లో తిరుమల ఒకటి. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా అక్కడ తప్పు చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం’’

లడ్డూ అపవిత్రంపై చంద్రబాబు హెచ్చరిక

తదుపరి చర్యలపై అందరితోనూ చర్చిస్తున్నాం

తిరుమల ప్రక్షాళనతోనే పాపం బయటపడింది

బాబాయిని చంపి చెప్పిన అబద్ధాలే చెబుతున్నారు

తిరుమల లడ్డూకు వందల ఏళ్ల ప్రాశస్త్యం

గత ఐదేళ్లలో దాన్నంతా నాశనం చేశారు

లడ్డూలో వాడే నెయ్యికీ రివర్స్‌ టెండర్లు ఏమిటి?

తిరుమల కొండపై అసలు ల్యాబే లేదు..

జగన్‌ వెళ్లి కూర్చుని పరీక్షలు చేశారా?: సీఎం

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోనే అతి పవిత్ర క్షేత్రాల్లో తిరుమల ఒకటి. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా అక్కడ తప్పు చేసినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లడ్డూ తయారీని అపవిత్రం చేశారన్న విషయం బయటకు వచ్చిన తర్వాత దీనిపై ఏం చేయాలన్నదానిపై అందరితో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రజల మనోభావాలు గౌరవించాలి. అదే సమయంలో శ్రీవారి ఆలయ గౌరవం పెంచాలి. మళ్లీ ఇటువంటి పాపాలు ఎవరూ చేయకుండా చూడాలి. ఇందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. తిరుమల లడ్డూకు వందల ఏళ్ల ప్రాశస్త్యం ఉందని, దానిని గత పాలకులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రసాదం లడ్డూను కాపీ కొట్టి తయారు చేయాలని అనేకమంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ అది సాధ్యపడలేదు. ఆ లడ్డూ తయారీ ఫార్ములా... అందులో వాడే పదార్థాలను కలపడంపై ఆ ఆలయంలో అత్యంత నైపుణ్యం సంపాదించారు. నేను అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ బిహార్‌కు చెందిన ఒక ధర్మకర్త కలిశారు. అయోధ్యలో తిరుమల తరహా లడ్డూ ప్రసాదాన్ని పెట్టాలని తిరుపతి నుంచి అనుభవం ఉన్నవారిని తీసుకువెళ్లి ప్రయత్నం చేశానని, కానీ ఆ రుచి రాలేదని ఆయన చెప్పారు. గతంలో ఇంట్లో తిరుమల ప్రసాదం ఉంచితే ఇల్లంతా ఘుమఘుమలాడేది. అంత ప్రాశస్త్యం వీళ్ల వల్ల నాశనం అయింది. ఏమిటీ దుర్మార్గం అని మనసు చివుక్కుమంటోంది. ఆవేశం, బాధ కలుగుతున్నాయి. మన ప్రజలు....బాబాయిని కిరాతకంగా చంపినా భరించారు. ఆ రోజే తిరుగుబాటు జరిగి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. నెయ్యికి రివర్స్‌ టెండరింగ్‌ ఏమిటి? కిలో నెయ్యి రూ.320కి ఎలా వస్తుంది? కనీస ఆలోచన అక్కర్లేదా? ఇవి చేయాలని దేముడు చెప్పాడా’ అని ప్రశ్నించారు.


దేముడే నా నోట చెప్పించాడేమో!

పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే లడ్డూ వివాదాన్ని చంద్రబాబు లేవనెత్తారని జగన్‌ చేసిన ఆరోపణను ఆయన తిరస్కరించారు. ‘‘ఇందులో దృష్టి మళ్లించడం ఏముంది? మా ప్రభుత్వం రాగానే తిరుమలకు ఈవోగా శ్యామలరావును వేశాం. తిరుమలను ప్రక్షాళన చేయాలని చెప్పాం. ఆయన నాకు ప్రతి రోజూ ఏం చేస్తున్నారో చెప్పరు. మేం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అన్నీ సరిచేసుకొంటూ వెళ్లారు. నాణ్యతను పరీక్షించి కొన్ని కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. నిపుణుల కమిటీ వేసి వారి సలహాలు తీసుకొన్నారు. మంచి నెయ్యి కోసం మళ్లీ టెండర్లు పిలిచి నందినీ నెయ్యిని ఎంపిక చేశారు. ప్రక్షాళన చేశారు. కానీ అవన్నీ బయటకు చెప్పలేదు. ఆ రోజు ఎన్డీయే సమావేశంలో అనుకోకుండా ఈ విషయాలు నా నోటి నుంచి వచ్చాయి. దేముడే చెప్పించాడేమో’ అని చంద్రబాబు అన్నారు. జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వ్యాఖ్యానించారు. ‘‘రామతీర్థంలో రాముడి తల తీస్తే పట్టించుకొన్న దిక్కు లేదు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారని ఎంతోకాలంగా భక్తులు అంటున్నా పట్టించుకోలేదు. ఇప్పుడవన్నీ బయటకు వచ్చినా పశ్చాత్తాపం లేదు. ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మాఫియా డాన్‌ ఎస్కోబార్‌తో పోల్చాను’’ అని అన్నారు.

జగన్‌ ఇంటి దగ్గర తిరుమల సెట్టింగా?

నెయ్యి నాణ్యతను ప్రతి రోజూ మూడుసార్లు పరీక్ష చేస్తున్నారన్న జగన్‌ వాదనను చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘‘తిరుమలలో అసలు ల్యాబ్‌ లేదు. మరి పరీక్షలు ఎలా చేస్తారు? జగన్‌ వెళ్లి చేశాడా? వైవీ సుబ్బారెడ్డి వందసార్లు మాల వేసుకొన్నారట! బ్రహ్మోత్సవాల సంప్రదాయాలు ఆయన ఏనాడైనా పాటించారా? జగన్‌ ఇంటి దగ్గర తిరుమల సెట్టింగ్‌ వేయించడం ఏం పద్ధతి? ప్రతి ఆలయానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కేరళలో గురువాయూర్‌ ఆలయం లోపలికి వెళ్లాలంటే చొక్కా తీసి వెళ్లాలి. అది అక్కడ పద్ధతి. తిరుమలలో స్వామివారిని అన్య మతస్థులు దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇచ్చి వెళ్లాలి. దానిని పాటించారా? ఆలయ సంప్రదాయాలను గౌరవించే బాధ్యత వీరికి లేదా? మనోభావాలను పట్టించుకోరా? గతంలో అనేక మంది పాలకులు వచ్చినా ఎవరూ స్వామివారి విషయంలో లాలూచీ పడలేదు. వీళ్లు వచ్చి విచ్చలవిడిగా చేశారు. పవిత్ర క్షేత్రం విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలన్న జ్ఞానం లేకుండా వ్యవహరించారు’’ అని ఆయన అన్నారు. తిరుమలలో సంప్రోక్షణ ఎలా చేయాలన్నదానిపై జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ నిపుణులు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందుతున్న తీరుపై శనివారం మరోసారి సమీక్ష చేస్తున్నామని, త్వరగా అందడానికి చర్యలు తీసుకొంటామని చంద్రబాబు తెలిపారు.

‘‘తిరుమల లడ్డూను కాపీ కొట్టి తయారు చేయాలని అనేకమంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ అది సాధ్యపడలేదు. ఆ లడ్డూ తయారీ ఫార్ములా... అందులో వాడే పదార్థాలను కలపడంపై ఆ ఆలయంలో అత్యంత నైపుణ్యం సంపాదించారు. నేను అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ బిహార్‌కు చెందిన ఒక ధర్మకర్త కలిశారు. తాను అయోధ్యలో నిర్మించిన ఓ ఆలయంలో తిరుమల తరహా లడ్డూ ప్రసాదాన్ని పెట్టాలని తిరుపతి నుంచి అనుభవం ఉన్నవారిని తీసుకువెళ్లి ప్రయత్నం చేశానని, కానీ ఆ రుచి రాలేదని ఆయన చెప్పారు. గతంలో ఇంట్లో తిరుమల ప్రసాదం ఉంచితే ఇల్లంతా ఘుమఘుమలాడేది. అంత ప్రాశస్త్యం వీళ్ల వల్ల నాశనం అయింది. అసలు నెయ్యికి రివర్స్‌ టెండరింగ్‌ ఏమిటి? కిలో నెయ్యి రూ. 320కి ఎలా వస్తుంది? కనీస ఆలోచన ఉండనక్కర్లేదా? జరిగిన మన ప్రజలు....బాబాయిని కిరాతకంగా చంపినా భరించారు. ఆ రోజే తిరుగుబాటు జరిగి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు’’

- సీఎం చంద్రబాబు

Updated Date - Sep 22 , 2024 | 06:13 AM