ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మున్సిపల్‌ కార్మికుల నిరసన

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:07 AM

మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఏలూరు నగర పాలక సంస్థ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన

సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 12: మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల చేసిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చి హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో మళ్ళీ ఉద్యమంలోకి వెళ్తామన్నారు.

చింతలపూడి: మునిసిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీవో రూపంలో విడుదల చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ చింతలపూడి మునిసిపల్‌ కార్మికులు సోమవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసనలో మునిసిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. మండల శాఖ అధ్యక్షురాలు వెలగాడి అనురాధ మాట్లాడుతూ జనవరి 3 నుంచి 10 వరకు మునిసిపల్‌ కార్మికులు సమ్మె చేయగా ప్రభుత్వం చర్చలకు పిలిచి రూ.21 వేలకు జీతం పెంచుతున్నామని చెప్పి ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల చేయలేదన్నారు. పండుగ అలవెన్సు రూ.వెయ్యి ఇస్తామని జీవో విడుదల చేసి అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఒప్పుకున్న విధంగా సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళన చేపడతామని, మంగళవారం మునిసిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలి పారు. మునిసిపల్‌ కార్మిక నాయకుడు శ్రీరామ్‌ వెంకటయ్య, పార్వతి, బొత్స సత్యనారాయణ, పుల్లయ్య, సాయమ్మ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్‌ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు విఘ్నేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు దశల వారీ నిరసనలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు చెప్పారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమించి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికీ కార్మికులకు జనవరి నెల జీతాలు ఇవ్వలేదని, పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్‌ చెల్లించలేదని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ కార్యదర్శి బొక్క శ్రీనివాస్‌, ఉపాఽధ్యక్షుడు ఇంగుర్తి నాగరాజు, చాపల రమేష్‌, కలపాల యేసు, సోమయాజుల వీరప్రసాద్‌, ముప్పిడి శ్రీను, పొడుదోలు రమణ, కొత్తూరి ఎమిలేశ్వరరావు, యడ్లపల్లి ప్రసాద్‌, దోసూరి నాగరాజు, ఎన్‌.సుబ్బారావు, అయినాల ముత్యాలరావు, ప్రసాద్‌, అప్పలస్వామి, వీర్రాజు, కన్నూరు రాంబాబు, ముప్పిడి నాగేశ్వరావు తదితర కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:07 AM

Advertising
Advertising