ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దగా ప్రభుత్వం

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:03 AM

అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను జగన్‌ దగా చేశారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

ఏపూరులో చింతమనేని ప్రభాకర్‌ ప్రచారం

అమ్మఒడి పేరుతో తల్లిదండ్రులకు మోసం

భవిష్యత్‌కు గ్యారెంటీ ప్రచారంలో టీడీపీ నేతలు

పెదపాడు, ఫిబ్రవరి 12 : అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను జగన్‌ దగా చేశారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఏపూరులో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో చింతమనేని మాట్లాడుతూ అమ్మఒడి పేరుతో తల్లులను మోసం చేసి జగన్‌ గద్దెనెక్కారన్నారు. అటువంటి మోసగాడిని గద్దె దించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించి చంద్రన్న అందించబోయే ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు సాయం అందిస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే ఇస్తానని మాట మార్చడం జరిగిందన్నారు. చంద్రబాబు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు అందించబోతు న్నారన్నారు. అనంతరం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురికి పార్టీ కం డువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మోరు శ్రావణి, ఉప్పలపాటి రాంప్రసాద్‌, గుత్తా అనిల్‌, గారపాటి రామసీత, వేమూరి శ్రీనివాసరావు, లావేటి శ్రీనివాసరావు, కొత్తూరు చిన్నబాబు, మట్టా శ్రీనివాసరావు, బెక్కం లక్ష్మీనారాయణ, పావులూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. రామనుజపు రంలో భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలన్నీ అభివృ ద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుంతల రహదారుల్లో వాహనదారు లు ప్రమాదాలకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి టీడీపీ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్‌, రాంబాబు, రామారావు, ఎంపీ టీసీ చిన్నబ్బి, యర్రమళ్ళ రాజు, శ్రీను, షేక్‌ సుభాని, తదితరులు ఉన్నారు.

ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ ప్రచార కార్యక్రమం

జంగారెడ్డిగూడెం టౌన్‌: చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత జగన్‌ రెడ్డి పాలనా వైఫల్యాలపై యువ ఓటర్లకు అవగాహన కల్పించడమే లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాం చంద్ర శేషు అన్నారు. ‘నా మొదటి ఓటు అభివృద్ధికే– నా మొదటి ఓటు చంద్రబా బుకే’ ప్రచార కార్యక్రమాన్ని కౌన్సిలర్‌ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద మండ వ లక్ష్మణరావు, నంబురి రామచంద్రరాజు, పరిమి సత్తిపండు, చిట్టిబొయిన రామలింగేశ్వరరావు, సాయిల సత్యనారాయణతో కలసి శేషు ప్రారంభించారు. మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి లో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు గతంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిస్థితి వివరిస్తామన్నారు. యువ ఓటర్లను మొదటి సారి ఓటు హక్కు వినియోగించే యువతను తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. యువ ఓటర్లతో ముఖాముఖి నిర్వహిస్తామని తెలిపారు. కళాశాల విద్యార్థులకు ప్రజాస్వా మ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. కంపా రాజేంద్ర, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, తాళ్లూరి వెంకటేశ్వరరావు, మన్యం దుర్గారావు, పోలవరం యువ నాయకుడు బొబ్బర రాజు, గోలి అనిల్‌, లాగు రాజ్‌కుమార్‌, పులపాకుల విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:03 AM

Advertising
Advertising