ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Assembly Elections: ఎమ్మిగనూరులో గెలుపు ఎవరిది..?

ABN, Publish Date - May 09 , 2024 | 04:43 PM

ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం. కర్నూలు, మంత్రలయం నియోజకవర్గాలకు మధ్య ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్ది పట్టం కడతారా? లేక అధికార వైసీపీ ఉపయోగించి కులం కార్డుకు చిక్కుతారా? అంటే.. నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికే పట్టే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తున్నాయి.

ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం. కర్నూలు, మంత్రలయం నియోజకవర్గాలకు మధ్య ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓటర్లు టీడీపీ అభ్యర్థిని గెలిపించి అభివృద్దికి పట్టం కడతారా? లేక అధికార వైసీపీ ఉపయోగించి కులం కార్డుకు చిక్కుతారా? అంటే.. నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికే పట్టే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తున్నాంది. అదీకాక.. ఈ జగన్ ప్రభుత్వం ఈ అయిదేళ్లలో అభివృద్ధి ఎంత చేసిందనే అంశాన్ని సైతం సదరు నియోజకవర్గ ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారు.


తండ్రి మాట కోసం..

ఎమ్మిగనూరు.. టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా, మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి తనయుడు బీవీ నాగేశ్వరరెడ్డి బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో కూడా బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో బరిలో దిగిన జయనాగేశ్వరరెడ్డి.. చెన్నకేశవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఓడినా గెలిచినా ఎమ్మిగనూరు మాత్రం వదలవద్దంటూ.. తన తండ్రి తన వద్ద మాట తీసుకున్నారని నాగేశ్వరరెడ్డి తరచు పేర్కొంటారు. ఆ క్రమంలో సునాయాసంగా గెలుపు స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ అగ్రనాయకత్వం కోరినా తాను వెళ్లలేదని జయ నాగేశ్వరరెడ్డి చెబుతారు.


చెన్నకేశవుడికి హ్యాండ్ ఇచ్చిన వైఎస్ జగన్

మరోవైపు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకాను వైసీపీ బరిలో దించింది. 2014 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది.

అలాగే నాటి నుంచి వైసీపీకి సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు మళ్లీ ఆమె వైసీపీలో చేరి.. ఎమ్మిగనూరు టికెట్ ఆశించారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నకేశవరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. కానీ ఈ సారి పార్టీ టికెట్ చెన్నకేశవరెడ్డికి నిరాకరించింది.


అందుకే ఏరీ కోరి బుట్టాకి సీటు

అదీకాక సదరు నియోజకవర్గంలో టీడీపీ చాలా బలపడింది. దీంతో వైసీపీ అభ్యర్థి ఓటమి తప్పదని ఆ పార్టీ అదినాయకత్వం గుర్తించింది. ఆ క్రమంలో నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే ఆమె స్థానికురాలు కాదనే ఓ ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా జరుగుతుంది.


నాగేశ్వరరెడ్డి గెలుపు ఖాయం..!

అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సైతం ఆమె గెలుపు కోసం సహకరించే పరిస్థితి లేదనే ఓ ప్రచారం సైతం నడుస్తుంది. ఇక వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని.. యువతకు ఉపాది కూడా లేదని.. చేనేత రంగాన్ని సైతం ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అటువంటి వేళ.. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ జెండా రెపరెలాడడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. అంటే జీవీ జయనాగేశ్వరరెడ్డి విజయం దాదాపు ఖయమైనట్లేననే ఓ ప్రచారం అయితే నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తుంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 09 , 2024 | 05:03 PM

Advertising
Advertising