Sankranti Festival: ఆ జిల్లాల్లోనే సంక్రాంతి పందాలు ఎందుకు..కారణమిదేనా?
ABN, Publish Date - Jan 13 , 2024 | 02:12 PM
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు గ్రామాలకు తరలివెళ్తున్నారు. అయితే ప్రధానంగా కొన్ని జిల్లాల్లోనే పలు రకాల పోటీలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్(andhara pradesh)లో సంక్రాంతి(Sankranti festival) పండుగ వస్తే చాలు ఎక్కడెక్కడో ఉన్న జనాలు అంతా వారి వారి గ్రామాలకు పయనమవుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అమెరికాతోపాటు పలు దేశాల్లో ఉన్న ప్రజలు సైతం ఊళ్లకు తరలివస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి జనవరి 14, 15, 16 తేదీలలో వచ్చిన నేపథ్యంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఏకమై సంప్రదాయ బద్ధంగా వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాదు కొంతమంది తమ పాత మిత్రులను సైతం ప్రతి ఏటా సంక్రాంతికి కలుసుకుంటూ అనవాయితీగా ఈ పండుగలకు వస్తుండటం విశేషం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Nara Lokesh: రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ మూడు రోజుల పండుగ వేడుకలను ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వారు ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పండుగలకు స్వస్థలాలకు వచ్చి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ముగ్గుల పోటీలు, ప్రభల తీర్థం, మరికొన్ని చోట్ల ఎడ్ల పందాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో డ్యాన్స్ పోటీలు, కోడి పందాలు వంటివి నిర్వహిస్తారు.
కోడిపందాల సంస్కృతి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇది ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులు ఈ స్నేహపూర్వక పోటీలలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఈ పోటీలను వారి సంప్రదాయ పండుగ వేడుకల్లో భాగంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ పోటీలను చూసేందుకు స్థానిక ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలు మొత్తం ఈ మూడు రోజులు కోలాహలంగా మారిపోనున్నాయి.
Updated Date - Jan 13 , 2024 | 02:12 PM