ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Financial Rules: వినియోగదారులకు హై అలర్ట్.. వీటికి ఈ నెలే లాస్ట్

ABN, Publish Date - Sep 02 , 2024 | 01:26 PM

బ్యాంకులు ఇతర ఆర్థికపరమైన విషయాలు సెప్టెంబర్ నెలతో గడువు ముగియనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులు ఇతర ఆర్థికపరమైన విషయాలు సెప్టెంబర్ నెలతో గడువు ముగియనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఆధార్ అప్‌డేట్ గడువు..

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచితంగా ఆధార్‌ని అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా ఆధార్ అప్‌డేట్‌ గడువును జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఈ గడువు త్వరలో ముగియనుంది. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు అలర్ట్ కావాలి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు నిబంధనలు, బకాయి కనీస మొత్తం (MAD) చెల్లింపు గడువు తేదీలు మారాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా, ఈ సవరణలు సెప్టెంబర్ 2024 నుంచి అమల్లోకి వస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ లాయల్టీ ప్రోగ్రామ్ నియమాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లపై క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను మార్చింది. కొత్త నియమాలు సెప్టెంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఇందుకు సంబంధించి బ్యాంక్ సంబంధిత కస్టమర్‌లకు ఇమెయిల్ పంపింది.


ఐడీబీఐ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ గడువు

ఐడీబీఐ బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక FD గడువు తేదీని సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది.

ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌డీ గడువు

ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు ఇండ్ సూపర్ 300 రోజులలో సాధారణ ప్రజలకు 7.05 శాతం, సీనియర్‌లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. 400 రోజుల పాటు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం వడ్డీ రేట్లు ప్రకటించింది. ఈ ఎఫ్‌డీల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

ఎస్‌బీఐ అమృత్ కలాష్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI ) అమృత్ కలాష్ పథకం కింద పెట్టుబడి పెట్టడానికి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ పథకం కింద బ్యాంక్ 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకంపై సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. SBI వీ కేర్ ఎఫ్‌డీ పథకం గడువు కూడా అదే రోజు ముగుస్తుంది.

For Latest News click here

Updated Date - Sep 02 , 2024 | 01:26 PM

Advertising
Advertising