ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amazon: క్విక్ కామర్స్‌లోకి అమెజాన్ ఎంట్రీ!

ABN, Publish Date - Dec 10 , 2024 | 08:48 PM

క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత పెరగనుంది. ఈ రంగంలో తామూ ఎంట్రీ ఇస్తున్నట్టు అమెరిజాన్ ఉన్నతోద్యోగి ఒకరు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత పెరగనుంది. ఈ రంగంలో తామూ ఎంట్రీ ఇస్తున్నట్టు అమెరిజాన్ ఉన్నతోద్యోగి ఒకరు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమిట్ కార్యక్రమంలో పాల్గొన్న అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ త్వరలో తామూ క్విక్ కామర్స్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు పేర్కొన్నారు. 15 నిమిషాల్లో కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. క్విక్ కామర్స్‌కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును అమెజాన్ తేజ్ పేరిట అంతర్గతంగా పరీక్షిస్తున్నట్టు వెల్లడించారు. తొలుత ఎంపిక చేసిన నగరాల్లో తేజ్‌ను ప్రవేశపెట్టి ఆ తరువాత క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. క్విక్ కామర్స్ రంగంలో బ్లింకిట్, జెప్టో దూసుకుపోతున్న నేపథ్యంలో అమెజాన్‌ కూడా తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది (Business).

Flipkart: ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేవారికి ఝలక్.. అలా చేస్తే ఎక్స్ ట్రా ఛార్జీలు కట్టాల్సిందే..


‘‘షాపింగ్ కోసం వాహనాలను బయటకు తీసే బదులు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు డెలివరీ కావడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. వినియోగదారులకు అత్యధిక సౌకర్యం కలుగజేయడమే క్విక్ కామర్స్. మేము కూడా ఓ ఆఫరింగ్‌తో ముందుకు వస్తాము. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో అత్యవసరాలు డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తాము. కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తెస్తాము’’ అని పేర్కొన్నారు.

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌


అమెజాన్ సంభవ్ సమిట్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలను కూడా వెల్లడించారు. తమ కార్యక్రమాలతో 2025 కల్లా దేశంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి గత నాలుగేళ్లుగా క్రమంగా పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఈకామర్స్, లాజిస్టిక్స్, మ్యాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ రంగాల్లో 1.4 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలను డిజిటల్ ఎకానమీలో భాగం చేస్తూ ఎన్నో అవకాశాలు సృష్టించామని అన్నారు. 2025లో ఉద్యోగ కల్పనలో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read Latest and Business News

Updated Date - Dec 10 , 2024 | 08:58 PM