ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇక కార్డ్‌ నెట్‌వర్క్‌ ఎంపిక

ABN, Publish Date - Mar 07 , 2024 | 01:19 AM

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల జారీకి సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఖాతాదారులకు వీటిని జారీ చేసేటపుడు, మాస్టర్‌ కార్డు, వీసా, రుపేలలో ఏ నెట్‌వర్క్‌ కార్డు తీసుకోవాలనే...

కస్టమర్‌ ఇష్టమే : ఆర్‌బీఐ

ముంబై: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల జారీకి సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఖాతాదారులకు వీటిని జారీ చేసేటపుడు, మాస్టర్‌ కార్డు, వీసా, రుపేలలో ఏ నెట్‌వర్క్‌ కార్డు తీసుకోవాలనే విషయాన్ని పూర్తిగా ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయంలో ఖాతాదారులకు ఎటువంటి స్వేచ్చ లేదు. బ్యాంకులు ముందుగానే ఆయా నెట్‌వర్క్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆయా నెట్‌వర్క్‌ల క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులను మాత్రమే ఖాతాదారులకు అంటగడుతున్నాయి. ఇక ముందు ఇలాంటి ముందస్తు ఒప్పందాలేవీ కుదరవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఏ నెట్‌వర్క్‌ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు తీసుకోవాలనేది ఇక పూర్తిగా ఖాతాదారుల ఇష్టమని తెలిపింది. ఇప్పటికే క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులున్న ఖాతాదారులు తదుపరి రెన్యూవల్‌ టైమ్‌లో తమకు ఇష్టమైన నెట్‌వర్క్‌ కార్డును ఎంచుకోవచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలు జారీ అయిన ఆరు నెలల నుంచి అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

Updated Date - Mar 07 , 2024 | 01:19 AM

Advertising
Advertising