ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భళా భారత్‌!

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:16 AM

భారత ఆర్థిక ప్రగతి చక్రం మరింత వేగం పుంజుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 8.4 శాతానికి ఎగబాకింది...

విశ్లేషకుల అంచనాలను మించిన ఆర్థిక ప్రగతి

  • మూడో త్రైమాసికంలో 8.4 శాతానికి జీడీపీ వృద్ధి

  • మాన్యుఫాక్చరింగ్‌, మైనింగ్‌, నిర్మాణ రంగాల్లో జోష్‌

  • 2023-24 వృద్ధి రేటు అంచనా 7.6 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక ప్రగతి చక్రం మరింత వేగం పుంజుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 8.4 శాతానికి ఎగబాకింది. బ్లూంబర్గ్‌ సర్వేలో ఆర్థికవేత్తలు అంచనా వేసిన 6.6 శాతం వృద్ధితో పోలిస్తే చాలా అధికమిది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకోగలిగింది. తయారీ రంగం రెండంకెల వృద్ధిని కనబర్చడంతో పాటు మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌, నిర్మాణ రంగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇదే త్రైమాసికానికి వృద్ధి రేటు 4.3 శాతంగా ఉంది. క్యూ3 వృద్ధి అంచనాలను మించడంతో పాటు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక (క్యూ1) వృద్ధి రేటును తొలుత ప్రకటించిన 7.8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది.

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక (క్యూ2) వృద్ధి రేటును సైతం 7.6 శాతం నుంచి 8.1 శాతానికి పెంచింది. అలాగే, రెండో ముందస్తు అంచనాల్లో భాగంగా ఎన్‌ఎ్‌సఓ ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి రేటు అంచనాను సైతం 7.3 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం (2022-23) జీడీపీ వృద్ధి అంచనాను మాత్రం గతంలో ప్రకటించిన 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం గమనార్హం. ఎన్‌ఎ్‌సఓ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ క్యూ3లో వాస్తవిక జీడీపీ లేదా స్థిర ధరల (2011-12) ఆధారిత జీడీపీని రూ.43.72 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2022-23లో ఇదే త్రైమాసికానికి నమోదైన రియల్‌ జీడీపీ రూ.40.35 లక్షల కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 8.4 శాతం వృద్ధి నమోదైంది. ఇకపోతే, క్యూ3లో నామమాత్ర జీడీపీ లేదా ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీని రూ.75.49 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

2022-23 క్యూ3లో నమోదైన రూ.68.58 లక్షల కోట్ల నామినల్‌ జీడీపీతో పోలిస్తే 10.1 శాతం వృద్ధిని అంచనా వేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి వాస్తవిక జీడీపీ రూ.172.90 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన జీడీపీ రూ.160.71 లక్షల కోట్లతో పోలిస్తే 7.6 శాతం అధికమిది. కాగా, ఈసారి నామినల్‌ జీడీపీ రూ.293.90 లక్షల కోట్ల స్థాయికి పెరగవచ్చని అంచనా. 2022-23లో రూ.269.50 లక్షల కోట్ల నామినల్‌ జీడీపీతో పోలిస్తే 9.1 శాతం వృద్ధి చెందవచ్చని ఎన్‌ఎ్‌సఓ భావిస్తోంది.

దేశ ఆర్థిక వ్యవస్థ

శక్తి సామర్థ్యాలకు సంకేతం

మూడో త్రైమాసికంలో 8.4 శాతం జీడీపీ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థ సత్తాను ప్రదర్శించింది. దేశం వేగంగా వృద్ధి చెందడంతో పాటు 140 కోట్ల మంది దేశవాసులు మెరుగైన జీవనం గడిపేందుకు, వికసిత్‌ భారత సృష్టికి ప్రభుత్వం కృషిని కొనసాగిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ

గత ఆర్థిక సంవత్సరం

అంచనాలు తగ్గించడం వల్లే..

గత ఆర్థిక సంవత్సరంలో కొన్ని త్రైమాసికాల జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడమే ఈసారి జీడీపీ గణాంకాలు మెరుగ్గా కన్పిస్తుండటానికి ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాల జోరు అంచనాలను మించిన నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను దీర్ఘకాలంపాటు గరిష్ఠ స్థాయిల వద్దే కొనసాగించవచ్చు. ఆర్‌బీఐ కఠిన పరపతి విధానంలో వచ్చే ఆరు నెలల వరకు మార్పు ఉండకపోవచ్చు.

సుమన్‌ చౌదురి,

చీఫ్‌ ఎకనామిస్ట్‌ అండ్‌ రీసెర్చ్‌ హెడ్‌, అక్యూట్‌ రేటింగ్స్‌

Updated Date - Mar 01 , 2024 | 06:16 AM

Advertising
Advertising