Buddha Purnima: ఈ రాష్ట్రాల్లో రేపు బ్యాంకులు బంద్.. ఎందుకంటే
ABN, Publish Date - May 22 , 2024 | 04:01 PM
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మే 23న బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో లేనప్పటికీ ఆన్‌లైన్ సేవల్ని వినియోగించుకోవచ్చు.
ఢిల్లీ: బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మే 23న బ్యాంకులు బంద్(Bank Holiday) కానున్నాయి. ఆర్బీఐ సెలవుల జాబితా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో లేనప్పటికీ ఆన్‌లైన్ సేవల్ని వినియోగించుకోవచ్చు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, త్రిపుర, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులు రేపు మూసివేసి ఉంటాయి.
మేలో14 సెలవులు..
ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా బ్యాంక్ సెలవులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షెడ్యూల్ ప్రకారం.. ఈ నెలలో 14 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి.
మే డే, లోక్‌సభ సాధారణ ఎన్నికలు 2024, రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు, బసవ జయంతి/అక్షయ తృతీయ, బుద్ధ పౌర్ణిమ, నజ్రుల్ జయంతి వంటి పండగలు, కార్యక్రమాల కారణంగా మొత్తంగా 14 రోజులు బ్యాంకులు మూసి వేసి ఉన్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారవచ్చు.
Read Latest National News and Telugu News
Updated Date - May 22 , 2024 | 04:02 PM