ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Business Ideas: రూ.5 వేల పెట్టుపడి..ఇంటిదగ్గరే నెలకు రూ.60 వేలకుపైగా ఆదాయం!

ABN, Publish Date - Feb 02 , 2024 | 05:06 PM

మీరు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇంటివద్దనే ఉంటూ మహిళలతోపాటు పురుషులు కూడా చేసుకునేదే కారం పొడి వ్యాపారం.

మీరు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇంటివద్దనే ఉంటూ మహిళలతోపాటు పురుషులు కూడా చేసుకునేదే కారం పొడి వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి. దీనిలో నెలకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

ప్రస్తుతం అన్ని రకాల భారతీయ వంటకాలలో కారం పొడిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ వ్యాపారానికి పోటీ కూడా తక్కువగా ఉందని చెప్పవచ్చు. ముందుగా ఈ వ్యాపారం చేయాలని అనుకునే వారు రైతుల వద్ద నుంచి మంచి నాణ్యమైన మిర్చిని సేకరించి ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని మీ దగ్గర మిక్సి లేదా మిల్లులో కారం పొడిగా గ్రైండ్ చేయించాలి. ఆ తర్వాత సిద్ధమైన కారం పొడిని 100 గ్రాముల ప్యాకెట్లుగా రెడీ చేసుకోవాలి.


ఆ క్రమంలో 150 కేజీల కారం పొడి నుంచి 1500లకుపైగా 100 గ్రాముల ప్యాకెట్లు సిద్ధం అవుతాయి. వాటిని మీ ప్రాంతం లేదా నగరాల్లో ఉన్న ప్రముఖ షాపులకు 100 చొప్పున పంపిణీ చేసుకోవాలి. అయితే వాటికి మార్కెట్లో ఉన్న ధరల ఆధారంగా 2 లేదా మూడు రూపాయల మార్జిన్ చూసుకుని రేట్లను కేటాయించాలి.

ఆ విధంగా నెలకు వెయ్యి కారం ప్యాకెట్లు అమ్మినా కూడా ప్యాకెట్‌కు కనీసం రెండు రూపాయల మార్జిన్ వేసుకుంటే 30 రోజులకు 60 వేల వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ముందుగా 10 రూపాయల నుంచే ప్రారంభించవచ్చు. డిమాండ్‌ను బట్టి పెట్టుబడి, ఉత్పత్తిని పెంచుకోవచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ola: ఓలా స్కూటర్ల జీవితకాలం గురించి సీఈఓ కీలక ప్రకటన

Updated Date - Feb 04 , 2024 | 11:09 AM

Advertising
Advertising