Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎంత పెరిగాయంటే..
ABN, Publish Date - Feb 17 , 2024 | 07:07 AM
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయినా దానిని పెరుగుదల కింద పరిగణించలేం. ఎందుకంటే పది రోజులుగా నడుస్తున్న తంతే.. ఇవాళ కూడా. గత పది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం. వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చాలా ఆసక్తికరంగా మారాయి.
Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయినా దానిని పెరుగుదల కింద పరిగణించలేం. ఎందుకంటే పది రోజులుగా నడుస్తున్న తంతే.. ఇవాళ కూడా. గత పది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం. వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చాలా ఆసక్తికరంగా మారాయి. పెరిగినా.. తగ్గినా రూ.10 మించి జరగడం లేదు. నిజానికి ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
అలాంటి సిక్కిం బంపర్ లాటరీ గత పది రోజులుగా కొనుగోలుదారులకు దక్కుతూనే ఉంది. ఇక ఇవాళ బంగారం ధర పెరిగింది. ఎంత పెరిగిందో మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.10 పెరిగింది. ఇక నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,110 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,300గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండిపై కేవలం రూ.100 పెరిగింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,100గా ఉంది.
Updated Date - Feb 17 , 2024 | 07:07 AM