ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Price: మహిళలకు శుభ వార్త.. తగ్గిన బంగారం ధరలు

ABN, Publish Date - Aug 28 , 2024 | 07:27 AM

గత కొంత కాలంగా పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరల్లో ఆగస్టు 28న స్వల్ప తగ్గుదల నమోదైంది. బుధవారం దేశంలోని అన్ని నగరాల్లో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10మేర ధర తగ్గింది.

హైదరాబాద్: గత కొంత కాలంగా పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరల్లో ఆగస్టు 28న స్వల్ప తగ్గుదల నమోదైంది. బుధవారం దేశంలోని అన్ని నగరాల్లో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10మేర ధర తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020కి చేరువైంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67 వేల 800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 170 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 930, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 020 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 020గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 020 వద్ద స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73 వేల 020 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


వెండి ధరలు..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం పెరిగాయి. బుధవారం కిలో వెండి రూ.100 పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబయి తదితర నగరాల్లో కిలో వెండి రూ. 88 వేల 600 వద్ద కొనసాగుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అత్యధికంగా రూ. 93 వేల 600 పలుకుతోంది.

Updated Date - Aug 28 , 2024 | 07:27 AM

Advertising
Advertising
<