ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices Today: దిగొస్తున్న పసిడి.. మీ నగరంలో ఇవాళ బంగారం ధరలు ఎంతంటే

ABN, Publish Date - Sep 06 , 2024 | 06:58 AM

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ బంగారం ధరలు రూ.100 మేర తగ్గాయి.ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం.దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750 వద్ద ఉంది.

  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,830కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900 వద్ద కొనసాగుతోంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 72,750వద్ద ట్రేడవుతోంది.


తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,680, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు...

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,800గా ఉండగా.. కోల్‌కతాలో రూ. 84,900, బెంగళూరులో రూ. 82,800 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 89,900 గా ఉంది.

For Latest News click here

Updated Date - Sep 06 , 2024 | 06:58 AM

Advertising
Advertising