ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధర ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:23 AM

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. భారీగా పెరిగో లేదంటే భారీగా తగ్గో షాకివ్వడం కాదు. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సహజం.

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. భారీగా పెరిగో లేదంటే భారీగా తగ్గో షాకివ్వడం కాదు. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సహజం. ఏ రోజున ఎలా పెరుగుతుందో లేదంటే ఎలా తగ్గుతుందో ఊహించడం కష్టం. కానీ గత వారం రోజులుగా బంగారం ధర రూ.10కి మించి పెరగడం కానీ తగ్గడం కానీ జరగడం లేదు. ఇలా ఒకే విధంగా తగ్గడమో.. పెరగడమో అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఇవాళ కూడా బంగారం ధర తగ్గింది. అది కూడా 10 గ్రాములపై రూ.10 మాత్రమే. ఇంకో విషయమేంటంటే.. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల విషయంలో తగ్గినా, పెరిగినా మార్పు ఉంటుంది. కానీ వారం రోజులుగా వ్యత్యాసమేమీ లేదు. 22, 24 క్యారెట్లపై సమానంగా రూ.10 తగ్గుతూ వస్తోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో రూ.56,890 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,060కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండిపై రూ.100 పెరిగి హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో రూ.76,100కి చేరింది.

Updated Date - Feb 16 , 2024 | 07:23 AM

Advertising
Advertising