Gold Silver prices: బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్
ABN, Publish Date - Oct 25 , 2024 | 08:28 PM
భారీగా పెరిగిపోయిన బంగారం కొనాలంటే జంకుతున్నారా?. అయితే మీకో గుడ్‌న్యూస్. దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇవాళ గణనీయంగా తగ్గాయి. దీపావళి, దంతేరాస్‌కు ముందు ఈ ధరలు తగ్గాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఒక లుక్ వేయవచ్చు.
న్యూఢిల్లీ: బంగారం కొనాలని ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. దీపావళికి ముందు పసిడి, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 మేర క్షీణించింది. దీంతో ధర రూ.80,050లకు దిగి వచ్చింది. ఈ భారీ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.80,050కి తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి రూ.350 తగ్గి రూ.80,450కి చేరిందని పేర్కొంది. పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండిలకు డిమాండ్ ఉంటుందని, ఇటీవల భారీగా పెరుగుదల నేపథ్యంలో తాజాగా తగ్గింపు కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడవచ్చని పేర్కొంది. బంగారు ఆభరణాల కొనుగోలుకు మొగ్గుచూపవచ్చని తెలిపింది.
రూ.2000 తగ్గిన వెండి
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఇవాళ (శుక్రవారం) కిలో వెండి రూ.2,000 మేర క్షీణించి రూ.99,000కి పడిపోయింది. క్రితం ముగింపు సెషన్ గురువారం నాడు కిలో వెండి ధర రూ.1.01 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారీ ధరల నేపథ్యంలో స్థానిక మార్కెట్‌లలో నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. విదేశీ మార్కెట్‌లలో కొనసాగుతున్న ట్రెండ్ దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ముహూరత్ ట్రేడింగ్‌కు 10 బెస్ట్ స్టాక్స్ ఇవేనట
Updated Date - Oct 25 , 2024 | 08:32 PM