ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google Pixel 9: భారత్‌ మార్కెట్‌లో సరికొత్తగా 3 ఫోన్లు ఆవిష్కరించిన గూగుల్

ABN, Publish Date - Aug 14 , 2024 | 09:13 AM

సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. గూగుల్ కంపెనీ ఇటీవల పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ ఫోన్‌లను అధికారికంగా ఆవిష్కరించింది.

Google Phones

సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. గూగుల్ కంపెనీ ఇటీవల పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ ఫోన్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ మధ్యే నిర్వహించిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో భారత్ మార్కెట్‌లోకి ఈ ఫోన్లను విడుదల చేసింది.


ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త టెన్సర్ జీ4 ఎస్‌వోసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌ ఆధారంగా ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఈ మూడు మోడల్‌ ఫోన్లు నీరు, ధూళి నిరోధకత ఫీచర్‌ను కలివున్నాయి. రిఫ్రెష్ రేటింగ్‌ ఐపీ68గా ఉంది. ఇక ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, పిక్సెల్ డ్రాప్‌లను ఏడేళ్లపాటు కంపెనీయే అందించనుంది.


ధరలు ఇవే..

ఆగస్టు 22 నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు మొదలుకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. పిక్సెల్ 9 రేటు రూ.79,999గా ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ 12జీబీ ర్యామ్+ 256జీబీగా ఉంది. పియోనీ, పింగాణీ, అబ్సిడియన్, వింటర్‌గ్రీన్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక పిక్సెల్ 9 ప్రో ఫోన్ ధర రూ.1,09,999 ఉండగా.. 16జీబీ ర్యామ్, 256జీబీగా ఉంది. హాజెల్, పింగాణీ, రోజ్ క్వార్ట్జ్, అబ్సిడియన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక పిక్సెల్ 9 ప్రో మ్యాక్ ధర రూ.1,24,999గా ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ 16జీబీ ర్యామ్ + 256జీబీగా ఉంది.


ప్రత్యేక ఫీచర్లు ఇవే..

పిక్సెల్ 9 డిస్‌ప్లే సైజు 6.3-అంగుళాలుగా ఉంది. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, 2,700 నిట్స్ బ్రైట్‌నెస్‌, టెన్సార్ జీ4 ఎస్‌వోసీ పవర్డ్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ముందువైపున ఉంది. బ్యాటరీ కెపాసిటీ 4,700 ఎంఏహెచ్, 45 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది.


ప్రో, ప్రో ఎక్స్ఎల్ ప్రత్యేకతలు ఇవే..

పిక్సెల్9 ప్రో రిఫ్రెష్ రేట్ 120హెట్జ్‌గా ఉంది. బ్రైట్‌నెస్3,000 నిట్స్, డిస్‌ప్లే 6.3-అంగుళాల సూపర్ ఆక్యూ ఓఎల్‌ఈడీగా ఉన్నాయి. ఇక పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ 6.8-అంగుళాల సూపర్ ఆక్టువా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తయారైంది. కాగా పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఫోన్‌లలో ఒకే మాదిరిగా కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడల్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్

గరిష్టంగా 30రెట్లు సూపర్ రెస్ జూమ్, 5రెట్లు ఆప్టికల్ జూమ్‌తో 48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. రెండింటికీ 42-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక రెండు మోడళ్లు 8కే క్వాలిటీతో వీడియో రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. పిక్సెల్ 9 ప్రో కెపాసిటీ 4,700ఎంఏహెచ్‌గా ఉంది. పిక్సెల్ ప్రో ఎక్స్‌ఎల్ సామర్థ్యం 5,060ఎంఏహెచ్‌గా ఉంది. ఈ రెండు ఫోన్లు 45వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది.

Updated Date - Aug 14 , 2024 | 09:13 AM

Advertising
Advertising
<