జీఎస్‌టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు ఫిబ్రవరిలో 12.5 శాతం వృద్ధి
ABN, Publish Date - Mar 02 , 2024 | 01:09 AM
దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎ్‌సటీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో 12.5 శాతం పెరిగి రూ.1,68,337 కోట్లకు చేరాయి.
న్యూఢిల్లీ: దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎ్‌సటీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో 12.5 శాతం పెరిగి రూ.1,68,337 కోట్లకు చేరాయి. జీఎ్‌సటీ వసూళ్లలో ఫిబ్రవరి నాలుగో అత్యుత్తమ నెలగా నిలిచింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో వసూళ్లు 11.7 శాతం వృద్ధితో రూ.18.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. విభాగాలవారీగా చూసినట్టయితే దేశీయ లావాదేవీల ద్వారా జీఎ్‌సటీ వసూళ్లలో 13.9 శాతం వృద్ధి నమోదు కాగా దిగుమతులపై జీఎ్‌సటీ వసూళ్లు 8.5 శాతం పెరిగాయి. కాగా నెలవారీ సగటు వసూళ్లు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ.1.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చితే వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు అధికం. రిఫండ్లను తీసివేయగా నికర జీఎ్‌సటీ వసూళ్లు ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లున్నాయి. మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎ్‌సటీ రూ.41,856 కోట్లు కాగా రాష్ర్టాల జీఎ్‌సటీ వాటా రూ.35,953 కోట్లుగా ఉంది.
ఇప్పటివరకు జీఎ్‌సటీ వసూళ్లలో అత్యుత్తమ రికార్డు 2023 ఏప్రిల్‌లో నమోదైన రూ.1.87 లక్షల కోట్లు. ఈ ఏడాది జనవరి రూ.1.74 లక్షల కోట్లతో రెండో స్థానంలోను, రూ.1.72 లక్షల కోట్లతో 2023 అక్టోబరు మూడో స్థానంలోను నిలిచాయి.
వినియోగంలో జోరుకు సంకేతం: జీఎ్‌సటీ వసూళ్లలో వృద్ధి వినియోగంలో పెరిగిన జోరుకు దర్పణమని పరిశీలకులంటున్నారు. సుమారుగా అన్ని రాష్ర్టాలూ జీఎ్‌సటీ వసూళ్లలో 8 నుంచి 21 శాతం వృద్ధిని నమోదు చేశాయని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మణ అన్నారు. గురువారం విడుదలైన జీడీపీ గణాంకాలు, శుక్రవారం విడుదలైన ఆటోమొబైల్ అమ్మకాల్లో వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థలో పటిష్ఠతకు సంకేతమని కేపీఎంజీ ఇండియా పార్టనర్ అభిషేక్ జైన్ అన్నారు.
Updated Date - Mar 02 , 2024 | 01:14 AM