ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NPS: నేషనల్ పెన్షన్ స్కీమ్ కు మీరు అర్హులా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:00 PM

నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు జమ చేయడం, విత్ డ్రాలు చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెల్లడించింది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు జమ చేయడం, విత్ డ్రాలు చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెల్లడించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది పదవీ విరమణ పొదుపు పథకం. దీనిని ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( PFRDA ) నియంత్రిస్తుంది. ఈ ఖాతాను ఎలా తెరవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అధికారిక eNPS వెబ్‌సైట్ (https://enps. nsdl.com/eNPS/NationalPension-System.html) లేదా NPS సేవలను అందించే ఏదైనా అధీకృత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి, న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దరఖాస్తుదారు తన ఆధార్ లేదా పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. OTP ధ్రువీకరణ తర్వాత, వ్యక్తిగత వివరాలను పూరించాలి. ఇటీవలి ఫొటో, సంతకం, రద్దయిన చెక్కు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అప్‌లోడ్ చేయాలి.

ఖాతా ఎంపిక తర్వాత ఖాతా రకాన్ని టైర్ I లేదా టైర్ II లేదా రెండింటినీ ఎంచుకోవలసి ఉంటుంది. టైర్ I అనేది పన్ను ప్రయోజనాలను అందించే తప్పనిసరి ఖాతా. కానీ ఉపసంహరణలపై పరిమితులను కలిగి ఉంటుంది. టైర్ II అనేది మరింత ప్రయోజనాలు అందించే స్వచ్ఛంద ఖాతా. దీనికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. టైర్ I కోసం కనీసం రూ.500, టైర్ II ఖాతా కోసం రూ.1,000 తో ప్రారంభించవచ్చు. అనంతరం దరఖాస్తుదారుడు 12-అంకెల శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) పొందుతాడు. ఈ ఖాతాను పూర్తి చేసేందుకు ఇ-సైన్ లేదా ఓటీపీ ఎంటర్ చేయాలి.


ఈపీఎఫ్ఓతో సమానంగా జాతీయ పెన్షన్ స్కీమ్‌లోనూ చందాదారులకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని ఇప్పటికే పెన్షన్ ఫండ్‌ రెగ్యులేటరీ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కేంద్రాన్ని కోరింది. ఎన్ పీఎస్ చందాదారులుగా ఉన్న 75 ఏళ్ల వయసు పైబడిన వారికి అదనపు ప్రయోజనాలు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. వీరికి రూ.50 వేల వరకూ పన్ను రాయితీ లభిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 12:00 PM

Advertising
Advertising