Hyundai Creta: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా..ఈ అప్‌డేట్స్ తెలుసా
ABN, Publish Date - Jan 08 , 2024 | 02:20 PM
హ్యుందాయ్(hyundai) మోటార్స్ క్రెటా(creta) ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 16, 2024న దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ గురించి కీలక వివరాలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇఫ్పుడు చుద్దాం.
హ్యుందాయ్(hyundai) మోటార్స్ క్రెటా(creta) ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 16, 2024న దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ గురించి కీలక వివరాలను ప్రకటించారు. హ్యుందాయ్ గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ అయిన 'సెన్సుయస్ స్పోర్టినెస్' బ్రాండ్‌కు అనుగుణంగా ఉంది. ఈ SUV ఏడు వేరియంట్‌లలో విడుదల చేయబడుతుంది. ఇక దీని
ముందు వైపున కొత్త క్రెటా పారామెట్రిక్ జ్యువెల్ థీమ్‌తో రీ డిజైన్ చేయబడిన గ్రిల్‌ను కలిగి ఉంది. కొత్త హారిజాంటల్ LED పొజిషనింగ్ ల్యాంప్స్, DRL, క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ కారణంగా రీప్రొఫైల్ చేయబడిన ఫ్రంట్ బంపర్ చిన్నదిగా కనిపిస్తుంది. వెనుక వైపున ఇది H ఆకారపు LEDతోపాటు టెయిల్‌గేట్‌ను కలిగి ఉంది. ఇది మస్కులర్ బాష్ ప్లేట్‌తో కూడిన కొత్త బ్యాక్ బంపర్ సపోర్ట్‌తో వస్తుంది.
ఇక దీనిని విజువల్స్‌లలో చూస్తే క్రేజీగా కనిపిస్తుంది. హైలైట్‌లలో షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ స్పాయిలర్, వెనుక వైపర్, పైన బ్రేక్ ల్యాంప్ ఉన్నాయి. ఇది కాకుండా, హ్యుందాయ్ 6 మోనో టోన్, ఒక డ్యూయల్ టోన్ ఆప్షన్‌తో సహా బహుళ రంగు ఎంపికలను అందిస్తుంది. సింగిల్ టోన్‌లో బలమైన ఎమరాల్డ్ పెర్ల్ (New), ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే ఉన్నాయి, డ్యూయల్ టోన్‌లో, బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్ కలర్ ఆప్షన్ ఉంది.
హ్యుందాయ్ రీడిజైన్ చేయబడిన డాష్‌బోర్డ్ లేఅవుట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ట్విన్ స్క్రీన్ సెటప్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా కొత్త క్యాబిన్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రీడిజైన్ చేయబడిన ఎయిర్ కాన్ వెంట్స్, కొత్త HVAC కంట్రోల్స్, టచ్ ప్యానెల్, కొత్త డ్యూయల్ టోన్ షేడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ వీటిని రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Updated Date - Jan 08 , 2024 | 02:22 PM