ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కార్పొరేట్‌ బోర్డుల్లో పెరిగిన ‘మహిళా’ స్వామ్యం

ABN, Publish Date - Mar 09 , 2024 | 02:58 AM

జనాభాలో అర్ధభాగానికి పైబడి తామే ఉన్నప్పటికీ వ్యాపార, పారిశ్రామిక విభాగాల్లో మాత్రం తమ పాత్ర పరిమితమేనన్నది పలువురు మహిళల ఫిర్యాదు.

న్యూఢిల్లీ: జనాభాలో అర్ధభాగానికి పైబడి తామే ఉన్నప్పటికీ వ్యాపార, పారిశ్రామిక విభాగాల్లో మాత్రం తమ పాత్ర పరిమితమేనన్నది పలువురు మహిళల ఫిర్యాదు. కానీ డెలాయిట్‌ గ్లోబల్‌ బోర్డ్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం కార్పొరేట్‌ బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య గత ఐదేళ్ల కాలంలో క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 18.3 శాతానికి చేరింది. అయితే ప్రపంచ సగటు 23.3 శాతంతో పోల్చితే మాత్రం మన దేశంలో కార్పొరేట్‌ మహిళా డైరెక్టర్ల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. 50 దేశాలకు చెందిన 18,000 కంపెనీల్లో ఈ సర్వే నిర్వహించారు. భారత్‌ నుంచి 400 కంపెనీలు వాటిలో ఉన్నాయి.

నివేదిక ముఖ్యాంశాలు...

2018 నాటికి మహిళా డైరెక్టర్ల సంఖ్య 13.8 శాతం కాగా 2021 నాటికి 17.1 శాతానికి, 2023 నాటికి 18.3 శాతానికి పెరిగింది.

2022 నుంచి మహిళా డైరెక్టర్ల సంఖ్య 3.6 శాతం పెరిగింది. దీని ప్రకారం చూస్తే 2038 నాటికి బోర్డుల్లో మహి ళా డైరెక్టర్ల సంఖ్య పురుషులతో సమానం అవుతుంది. గతంలో ప్రకటించిన అంచనా 2045తో పోల్చితే ఏడు సంవత్సరాల ముందే ఈ గమ్యం సాధ్యమవుతుంది.

2018 సంవత్సరంతో పోల్చితే డైరెక్టర్ల బోర్డుకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే మహిళల సంఖ్య 2023 నాటికి 4.5 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో సీఈఓలుగా సారథ్య బాధ్యతలు నిర్వహించే మహిళల సం ఖ్య మాత్రం 3.4 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది.

రంగాలవారీగా ధోరణులు పరిశీలించినట్టయితే 21.3 శాతం మహిళా డైరెక్టర్లతో లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ రంగం అగ్రస్థానంలో ఉంది. టెక్నాలజీ, మీడియా, టెలికాం (20.5 శాతం), కన్స్యూమర్‌ బిజినెస్‌ (19.7 శాతం), తయారీ (17.4 శాతం), ఆర్థిక సర్వీసులు (16.9 శాతం) తర్వాతి స్థానాల్లో టాప్‌ 5లో ఉన్నాయి.

మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు నిధుల కటకట

ఆర్థిక స్వతంత్రం, సాధికారత కోసం చేస్తు న్న పోరాటంలో భాగంగా భారతదేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షి్‌పలోకి ప్రవేశిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. విభిన్న రంగాలకు చెందిన పరిశ్రమల్లో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ విభిన్న అంశాల్లో వారు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. చక్కని నైపుణ్యాలు, నవ్య ఆలోచనా ధోరణులు ఉన్నప్పటికి ఇన్వెస్టర్‌ విశ్వాసం పొందడంలోను, నిధుల సమీకరణలోను వారు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా నిధుల కల్పనలో లింగవివక్ష అధికంగా ఉన్నట్టు పలు సర్వేలు తేల్చాయి. సుమారు 62 శాతం మంది మహిళలు ఈ వివక్షను అనుభవిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చి పెరుగుతున్న పోటీ వాతావరణంలో మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ప్రకాశించాలంటే మరిన్ని మద్దతు వ్యవస్థలను తీసుకురావలసిన అవసరం ఉన్నదని పలువురు అంటున్నారు. మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంపై అధిక మొత్తాల్లో ఇన్వెస్ట్‌ చేయడం అనేది నోటిమాటకే పరిమితం కాకూడదని, మహిళల ఉమ్మడి సామర్థ్యాలను వెలికి తీయడంలో కీలకమైన అడుగు కావాలని గ్రేట్‌ ప్లేసెస్‌ టు వర్క్‌ సీఈఓ యశస్విని రామస్వామి అన్నారు. మహిళలు ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు మద్దతు అవసరమన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 02:59 AM

Advertising
Advertising