ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jio Recharge Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన టెలికం దిగ్గజం

ABN, Publish Date - Sep 26 , 2024 | 11:53 AM

తన కస్టమర్లు పక్క కంపెనీల వైపు చూడకుండా సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.10 వెచ్చించి 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో అదిరిపోయే ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోండి.

భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియోతో (Reliance Jio) పాటు ఇతర ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఐడియా) జులై నెలలో రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జులు రెండింటినీ దాదాపు 15 శాతం వరకు పెంచాయి. టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్‌ఎల్ వైపు మొగ్గుచూపారు.

ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకున్న జియో తన కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.10కి సమాన ఖర్చుతో 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ వంటి సౌకర్యాలతో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీరూ తెలుసుకోండి.


రూ.999 రీఛార్జ్ ప్లాన్ వివరాలు ఇవే..

ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లతోపాటు అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. 2 జీబీ రోజువారీ డేటా కూడా లభిస్తుంది. అంతేకాదు 5జీ ఇంటర్నెట్ యాక్సెస్‌ ఉన్న ప్రాంతాల్లోనివారు అపరిమిత 5జీ డేటాను వాడుకోవచ్చు. జియోటీవీ, జియోక్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా వినియోగదారులు పొందవచ్చు.


ఎయిర్‌టెల్ నుంచి కూడా కొత్త ప్లాన్లు..

భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇటీవల కొన్ని కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.161, రూ.181, రూ.361 ప్లాన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అదనపు డేటా ప్యాక్‌లు. 30 రోజుల వ్యాలిడిటీతో వీటిని కంపెనీ ఆవిష్కరించింది. గతంలో ఈ ఆఫర్ల వ్యాలిడిటీ పరిమితంగా ఉండేది. ఇప్పుడు వాటిని సవరించి కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది.


రూ.161 ప్లాన్‌లో రోజువారీ డేటా వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు. 12 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యవధిలో వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క జీబీ విలువ దాదాపు రూ.13కు సమానం. ఇక రూ.181 ప్లాన్ రోజువారీ డేటా వినియోగంపై పరిమితి లేదు. 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌లో మొత్తం15GB డేటా లభిస్తుంది. సగటున ఒక్క జీబీ విలువ రూ.12కు సమానం. ఇక రూ.361 రీఛార్జ్ ప్లాన్‌లో మొత్తం 50జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా 30 రోజుల వ్యాలిడిటీతో ఈ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఒక జీబీ రూ.7కు సమానంగా ఖర్చవుతోంది.


ఇవి కూడా చదవండి

పసిడి రికార్డు పరుగు

ఎలక్ట్రిక్‌ ఎల్‌సీవీ విభాగంలోకి యూలర్‌

Updated Date - Sep 26 , 2024 | 12:00 PM