ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahindra: మహీంద్రా XUV400 ప్రో మార్కెట్లోకి విడుదల..ధర, ఫీచర్లు తెలుసా?

ABN, Publish Date - Jan 11 , 2024 | 02:48 PM

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా వారి ఏకైక ఎలక్ట్రిక్ కారు XUV400 అప్‌డేటెడ్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ దీనికి XUV400 ప్రో అని పేరు పెట్టగా..దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలుగా ప్రకటించింది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా వారి ఏకైక ఎలక్ట్రిక్ కారు XUV400 అప్‌డేటెడ్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ దీనికి XUV400 ప్రో అని పేరు పెట్టగా..దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలుగా ప్రకటించింది. మహీంద్రా XUV400 ప్రో మూడు వేరియంట్లలో రాబోతుంది. అయితే దీని కోసం రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే దీనిని ఫిబ్రవరి 1, 2024న డెలివరీ చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


మూడు వేరియంట్‌లలో AC Pro (34.5kWh బ్యాటరీ, 3.3 kW AC ఛార్జర్), EL Pro (34.5 kWh బ్యాటరీ, 7.2 kW AC ఛార్జర్), EL Pro (39.4 kWh బ్యాటరీ, 7.2 kW AC ఛార్జర్) ఉన్నాయి. ఇక వీటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా రూ.15.49 లక్షలు, రూ.16.74 లక్షలు, రూ.17.49 లక్షలుగా ప్రకటించారు. ఈ కార్లలో 34.5kWh, 39.4kWh బ్యాటరీ సపోర్ట్ ఉండగా.. మొదటి బ్యాటరీ ప్యాక్ 375 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని సంస్థ తెలిపింది. ఇక రెండోది ఒక్కసారి ఛార్జింగ్‌పై 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ ఇస్తుందని వెల్లడించారు.

కొత్త ఫీచర్లలో టాప్ స్పెక్ EL ప్రో వేరియంట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అప్‌డేట్ చేయబడిన ఎయిర్‌కాన్ ప్యానెల్, రియర్ టైప్ సీ USB పోర్ట్, రియర్ మొబైల్ హోల్డర్ ఉన్నాయి. EC Pro, EL Pro మార్పుల విషయానికొస్తే కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేయబడింది. దీంతోపాటు డాష్‌బోర్డ్ నలుపు, బూడిద రంగుల్లో వస్తుంది. ఈ ఆల్ ఎలక్ట్రిక్ SUV టాటా నెక్సాన్ EVకి పోటీగా మారనుంది.

Updated Date - Jan 11 , 2024 | 02:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising