Data Recharge: కప్పు టీ రేటుకు 10జీబీ డేటా.. ఇందులో నిజమెంత
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:31 PM
మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమటెడ్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, రోజుకు పరిమితంగా హైస్పీడ్ డేటాను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో రీఛార్జ్ రేట్లు పెరగడంతో పాటు మంత్లీ రీఛార్జ్ భారంగా మారిందని సామాన్య ప్రజలు..
నేడు ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతి పనికి ఇంటర్నెట్ అవసరమవుతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో డేటాను అధికంగా వినియోగిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 1 నుంచి 3జిబి డేటా అందించే నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమటెడ్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, రోజుకు పరిమితంగా హైస్పీడ్ డేటాను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో రీఛార్జ్ రేట్లు పెరగడంతో పాటు మంత్లీ రీఛార్జ్ భారంగా మారిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మంత్లీ ప్యాక్‌లో అందించే డేటా సరిపోకపోవడంతో స్పెషల్ డేటా ప్యాక్‌లను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. తాజాగా రెండు ప్రముఖ నెట్వర్క్‌లు కప్పు టీ ధరకే 10జీబీ డేటాను అందిస్తున్నాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. సాధారణంగా 10జీబీ డేటా కోసం కనీసం వంద రూపాయిలు ఖర్చు చేయాలి. కానీ రూ.11కే జియో, ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు 10జీబీ డేటా అందిస్తోంది. కానీ ఈ డేటా రీఛార్జ్ ప్లాన్‌కు కొన్ని షరతులు పెట్టింది. కేవలం ఒక గంట వ్యాలిడిటీతో మాత్రమే ఈ డేటా ప్లాన్ లభిస్తుంది. సాధారణంగా ఒక గంటల్లో 10జీబీ డేటాను ఉపయోగించడం అసాధ్యం. అయినప్పటికీ ఇంట్లో ఉంటే వైఫై ఉంటుంది. ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడు కొద్దిసేపు డేటా అత్యవసరం అయితే ఎక్కువ మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా రూ.11తో రీఛార్జ్ చేసుకుంటే గరిష్టంగా 10జీబీ డేటాను హైస్పీడ్‌తో ఉపయోగించుకోవచ్చు. ఇటీవల కాలంలో మంత్లీ రీఛార్జ్‌తో పాటు అదనంగా డేటా రీఛార్జ్ చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో టెలికం కంపెనీలు కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం రూ.11కే 10జీబీ డేటా అందిస్తున్న టెలికం కంపెనీల గురించి తెలుసుకుందాం
జియో..
రిలయన్స్ సంస్థకు చెందిన జియో రూ.11కు చౌకగా డేటా ప్లాన్ అందిస్తోంది. గంట వ్యాలిడిటీతో 10 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. కేవలం ఇది డేటా ప్లాన్ మాత్రమే. కాలింగ్, మేసేజ్ వంటి సౌకర్యం ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉండదు.
ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో వలె ఎయిర్‌టెల్ కూడా రూ.11 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.11తో డేటా రీఛార్జ్ చేస్తే ఒక గంట వ్యాలిడిటీతో 10 జీబీ డేటా పొందొచ్చు. ఈ రీఛార్జ్ కేవలం యాక్టివ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎటువంటి మంత్లీ, లేదా ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్ లేకుండా కేవలం డేటా రీఛార్జ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు లభించవు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 15 , 2024 | 02:13 PM