Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!
ABN, Publish Date - Jan 22 , 2024 | 02:00 PM
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రామ మందిర ప్రారంభోత్సవం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిస్తుందని చెప్పింది. దీంతోపాటు భారతదేశం ఒక కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌ను పొందినట్లు స్పష్టం చేసింది.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం
ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగం వాటా GDPలో 6.8 శాతంగా ఉంది. ఇప్పుడు అది FY 2033 నాటికి 8 శాతానికి చేరుతుందని జెఫరీస్ అంచనా వేసింది. మహమ్మారికి ముందు, పర్యాటక రంగం 2019 ఆర్థిక సంవత్సరంలో GDPకి 194 బిలియన్ డాలర్లను అందించింది. మరికొన్ని నెలల్లో అది 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జెఫరీస్ చెప్పింది. అయోధ్యలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా టూరిజంలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆతిథ్యం, FMCG, ప్రయాణ ఉపకరణాలు, సిమెంట్ మొదలైన అనేక రంగాల ప్రయోజనం ద్వారా ప్రతి ఏటా 85 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లాకు ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Updated Date - Jan 22 , 2024 | 02:11 PM