ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paytm: పేటీఎంపై ఆర్బీఐ తీవ్ర చర్యలు.. అప్పటినుంచి ఆ సర్వీసులు బంద్

ABN, Publish Date - Jan 31 , 2024 | 06:48 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది. అయితే.. కస్టమర్లు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ని ఎలాంటి సమస్య లేకుండా విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ ఖాతాలను కూడా సెంట్రల్ బ్యాంక్ రద్దు చేసింది.


సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌ల ధ్రువీకరణ నివేదిక అనంతరం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్‌లో పలు అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఈ నివేదిక వెల్లడించిందని.. అందుకే పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలపై పర్యవేక్షణ అవసరమని భావించామని తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పేర్కొంది. అయితే.. ఈ ఆంక్షలు Paytm యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై ఎలాంటి ప్రభావం చూపదు. అటు.. ఆర్బీఐ ఆదేశాలపై కంపెనీ లేదా దాని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇప్పటివరకూ స్పందించలేదు.

Updated Date - Jan 31 , 2024 | 06:48 PM

Advertising
Advertising