నియామకాల జోరు..
ABN, Publish Date - Mar 13 , 2024 | 05:32 AM
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో భారత కంపెనీలు నియామకాల జోరు పెంచనున్నాయి. మంగళవారం విడుదలైన ‘మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే’ ఈ విషయం తెలిపింది...
హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌లో మరిన్ని ఉద్యోగాలు
మ్యాన్‌పవర్ గ్రూప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో భారత కంపెనీలు నియామకాల జోరు పెంచనున్నాయి. మంగళవారం విడుదలైన ‘మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే’ ఈ విషయం తెలిపింది. ఈ త్రైమాసికంలో 36 శాతం భారత కంపెనీలు నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో 34 శాతం కంపెనీలు, చైనాలో 34 శాతం కంపెనీలు నియామకాలకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఇది 22 శాతం మాత్రమే. మొత్తం 42 దేశాలకు చెందిన 3,150 కంపెనీలను సర్వే చేసి మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ ఈ విషయం తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ జూన్ త్రైమాసికంలో నియామకాలు ఆరు శాతం పెరగనున్నాయి. అయితే 2024 మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఇది ఒక శాతం తక్కువ.
ఈ రంగాల్లోనే ఎక్కువ: వచ్చే జూన్ త్రైమాసికంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో 44 శాతం, కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీలు 43 శాతం, ఐటీ కంపెనీల్లో 41 శాతం నియామకాల జోరు పెంచనున్నాయి. ఈ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇందుకు కలిసి రానున్నాయి. ఎనర్జీ, యుటిలిటీ రంగాలకు చెందిన కంపెనీల్లో 20 శాతం కంపెనీలు మాత్రమే జూన్ త్రైమాసికంలో నియామకాలు పెంచుతామని తెలిపాయి.
Updated Date - Mar 13 , 2024 | 05:32 AM