ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రిలయన్స్‌ చేతికి డిస్నీ ఇండియా?

ABN, Publish Date - Feb 26 , 2024 | 03:57 AM

దేశ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకోబోతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వాల్ట్‌ డిస్నీ ఇండియా తమ మీడియా వ్యాపారాలను విలీనం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ వారం ఒప్పందం కుదుర్చుకునే చాన్స్‌!

న్యూఢిల్లీ: దేశ మీడియా రంగంలో భారీ విలీనం చోటు చేసుకోబోతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వాల్ట్‌ డిస్నీ ఇండియా తమ మీడియా వ్యాపారాలను విలీనం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఇప్పటికే స్పష్టమైన అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. రెండు కంపెనీలు ఈ వారంలో డీల్‌కు సంబంధించి అఽఽధికారిక ప్రకటన చేస్తాయని భావిస్తున్నారు. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌గానీ, వాల్ట్‌ డిస్నీ గానీ దీనిపై అధికారికంగా నోరు మెదపడం లేదు. అయితే ఈ నెల ఆరం భంలో డిస్నీ తన భారత వ్యాపారంలో 60 శాతం వాటాను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18కి విక్రయించేందుకు సిద్ధంగా ఉందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెల్లడించింది. ఇందులో భాగంగా కంపెనీ విలువను రూ.33,000 కోట్లు (390 కోట్ల డాలర్లు)గా లెక్కగట్టినట్లు పేర్కొంది.

రిలయన్స్‌కు 61 శాతం వాటా!

విలీన కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీకు 61 శాతం, వాల్ట్‌ డిస్నీకి 39 శాతం వాటా ఉంటుందని సమాచారం. అయితే దేశంలోని డిస్నీ ఆస్తుల విలువ మదింపు తర్వాత రెండు కంపెనీల మధ్య ఈ వాటాలపై స్పష్టమైన అవగాహన వస్తుందని తెలుస్తోంది. భారత స్ట్రీమింగ్‌ బిజినెస్‌లో వాల్ట్‌ డిస్నీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వంటి స్ట్రీమింగ్‌ యాప్స్‌తో సబ్‌స్ర్కెబర్లు తగ్గిపోతున్నారు. మీడియా, స్ట్రీమింగ్‌ వ్యాపారాల్లో దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్‌తో జట్టు కట్టడం ద్వారా స్ట్రీమింగ్‌ బిజినెస్‌లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవచ్చని డిస్నీ భావిస్తోంది, అందుకే ఈ విలీనం దిశగా చర్యలు తీసుకుందని భావిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 03:57 AM

Advertising
Advertising