ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Own Vs Rent : సొంత ఇల్లు వర్సెస్ అద్దె ఇల్లు! దీర్ఘకాలంలో ఏది లాభదాయకమంటే..

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:42 PM

అద్దె ఇంట్లో ఉండాలా లేక సొంత ఇల్లు కొనుక్కోవాలా అనేది వ్యక్తుల అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, అభిరుచులపై ఆధార పడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు కొనుక్కోవాలా లేక అద్దె ఇంట్లో కాలం గడపాలా?.. ఓ మోస్తరు సంపాదన ఉన్న ప్రతి ఒక్కరి మదిలో ఏదోక సమయంలో కలిగే సందేహం ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సంక్లిష్టమైనదని, అంతిమంగా ఇది వ్యక్తుల ఉద్యోగాల తీరుతెన్నులు, అభిరుచులు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెబుతున్నారు (Personal Finance).

Pan Card: మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నాయా? రిస్క్‌లో పడ్డారుగా!


అద్దె ఇంటితో కలిగే ప్రయోజనాలు..

నేటి జమానాలో యువత కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగం కోసం అవసరమైతే ఇతర ప్రాంతాలు, నగరాలు దేశాలకు కూడా వలస వెళుతోంది. ఇలాంటి వారు అద్దె ఇళ్లల్లో ఉంటే సబబేననేది నిపుణులు మాట. అద్దె ఇంటికి అడ్వాన్స్‌లు తక్కువగా ఉండటంతో ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా ఆదా అయ్యే డబ్బును ఇతర పెట్టుబడుల సాధనాల్లోకి మళ్లించొచ్చు. ఇక మహానగరాల్లో ఉండాల్సిన వాళ్లకు అద్దె ఇంట్లో ఉంటే ఖర్చులు అదుపులో ఉంటాయి. అద్దెలు ఏటా 10 శాతం పెరిగినా సొంతింటి ఈఎమ్ఐలతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి. అయితే, సొంత గూడు మాత్రం ఉండదనే చెప్పాలి.

Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!

సొంతింటితో ఉపయోగాలు..

సొంత ఇల్లుతో ఆర్థికపరమైన భద్రత కలుగుతుంది. ఇల్లు కొనేటప్పుడు డౌన్ పేమెంట్.. ఆ తరువాత ఈఎమ్ఐలు భారీగా ఉన్నా దీర్ఘకాలంలో రియల్ ఆస్తుల విలువ పెరుగుతుంది. అంతిమంగా లాభమే మిగులుతుంది. ఉదాహరణకు మహానగరాల్లో సగటున రెండున్నర కోట్ల ఖరీదైన ఇంటికి డౌన్ పేమెంట్ రూ.50 లక్షలు, ఈఎమ్ఐలు నెలకు రూ.2.5 లక్షలు అనుకుంటే పదేళ్లల్లో మొత్తం రూ.3 కోట్లు చెల్లించినట్టు అవుతుంది. అయితే, ఈ వ్యవధిలో ఇంటి విలువ మాత్రం 4.6 కోట్లకు చేరుతుంది. అంటే.. చివరగా లాభమే వచ్చిందన్నమాట.

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!


అయితే, మహానగరాల్లో ఇల్లు కొనే విషయంలో ప్రైస్ టూ రెంట్ నిష్ఫత్తిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నిష్పత్తి 20కి మించి ఉంటే అద్దె ఇంట్లోనే కొనసాగడం బెటర్. ఇది 15 కంటే దిగువన ఉంటే సొంతిల్లు లాభదాయకంగా మారుతుంది. అంతిమంగా దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని నిపుణులు చెబుతున్నారు. సొంతిల్లు కొనుక్కున్న వారికి దీర్ఘకాలంలో ఓ రియల్ ఆస్తి మిగిలితే అద్దె ఇంట్లో ఉంటూ వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టే వారికి డైవర్సిఫైడ్ పోర్ట్ ఫోలియోసొంతం చేసుకుంటారు. ఏది మంచిదనేది ఆయా వ్యక్తుల అవసరాలు, లక్ష్యాలను బట్టి ఆధారపడి ఉంటుందనేది నిపుణులు చెప్పే మాట.

Personal Finance: ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత నెలకు రూ.1.5 లక్షల పెన్షన్!

Read Latest and Business News

Updated Date - Sep 15 , 2024 | 07:50 PM

Advertising
Advertising